English | Telugu
శ్రీసత్య చెప్పిన హర్రర్ కథ.. భయంతో పరుగుతీసిన హౌస్ మేట్స్!
Updated : Dec 8, 2022
బిగ్ బాస్ అంటేనే కంటెస్టెంట్స్ చేసే వింత వింత చేష్టలు, ఆడే టాస్కులు, చెప్పే మాటలు.. ఇలా అన్నీ కలగలిపిన రియాలిటీ షో. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఒక వైపు ప్రైజ్ మనీ కోసం టాస్క్ లు జరిగాయి. మరోవైపు హర్రర్ సినిమాని తలపించేలా, కంటెస్టెంట్స్ చేసిన కొన్ని పనులు ఆడియన్స్ ని ఆకట్టున్నాయి.
అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అర్థరాత్రి పడుకునే సమయానికి.. శ్రీసత్య అందరికి దెయ్యం కథ చెప్పడం మొదలు పెట్టింది. "మా బుడ్డదాని బర్త్ డే పార్టీ కోసం జూలై పదమూడున మేమంతా ఒక రిసార్ట్ కి వెళ్ళాం. అక్కడ పార్టీ చేసుకున్నాం. నేను వెళ్ళి పడుకున్నా, ఇంతలో మాతో ఉన్న ఒక అబ్బాయి ఓ అంటూ అరుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత మంది ఆపినా ఆగట్లేదు. కట్టెతో కొట్టినా చలించట్లేదు. అందరూ కలిసి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అతను మళ్ళీ లేచి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు" అని శ్రీసత్య చెప్తుండగానే దెయ్యంలా నవ్వుతూ ఒక శబ్దం వినిపించింది. దీంతో శ్రీసత్య ఒక్కసారిగా తనున్న బెడ్ మీద నుండి జంప్ చేసి శ్రీహాన్ పడుకున్న బెడ్ లోకి వెళ్ళి, దుప్పటి కప్పుకొంది. మిగిలిన హౌస్ మేట్స్ అంతా ఒక్క సారిగా భయంతో ఉలిక్కిపడ్డారు.
ఆ తర్వాత కాసేపటికి అందరూ తేరుకున్నారు. బిగ్ బాస్ అలా దెయ్యం లాగా సౌండ్స్ క్రియేట్ చేసారని అనుకున్నారంతా. కానీ కాసేపటికి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అరుపులు మొదలయ్యాయి. దీంతో ఆదిరెడ్డి భయంతో పరుగుతీసాడు. అందరు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వస్తూ, "అందరం దగ్గర, దగ్గరగా ఉందాం" అంటూ శ్రీహాన్ అనగా, "అవును మామా" అని ఆదిరెడ్డి చెప్పాడు.
ఇదిలా ఉండగా కాసేపటికి అందరూ నార్మల్ అయ్యారు. ఆ తర్వాత ఇనయా వాష్ రూంకి వెళ్లింది. తర్వాత వాష్ రూం లోపల ఏదో ఉంది అన్నట్టుగా భయంతో బయటకు పరుగుతీయగా, హౌస్ మేట్స్ అందరూ ఒక్కో దిక్కుకి పరుగెత్తారు. కాసేపటికి ఇనయా ఫుల్ గా నవ్వేసరికి, తను ఆటపట్టించిందని అందరూ తెలుసుకున్నారు.