English | Telugu
యూట్యూబ్ లో 'షానీ సల్మాన్' జర్నీ వీడియో.. బిగ్ బాస్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
Updated : Dec 8, 2022
బిగ్ బాస్ మీద ట్రోల్స్ తో నెటిజన్లు చెలరేగిపోతున్నారు. కారణం ఏంటంటే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన మొదటి కంటెస్టెంట్ 'షానీ సల్మాన్'. అతడి జర్నీ వీడియో అప్పుడు వేయకుండా ఇప్పుడు యూ ట్యూబ్ లో వదిలారు. దీంతో ప్రేక్షకులు తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తున్నారు.
షానీ సల్మాన్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎవరితో గొడవలు పెట్టుకోలేదు. ఏ కంటెస్టెంట్ తోను నెగెటివ్ గా మాట్లాడింది కూడా లేదు. ఒక్క నామినేషన్స్ లో ఉన్నాడు అంతే. అయితే ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా షానికి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే తను ఓటింగ్ లో ఒకరిద్దరి కంటే కూడా మెరుగైన స్థానంలో ఉన్నాడు. తనకన్నా తక్కువగా ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నా కూడా షానిని ఎలిమినేట్ చేయడంపై, ఆ వారం అంతా బిగ్ బాస్ ని ట్రోల్ చేసారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ మొదలైంది.
అయితే ఎప్పటిలాగే ప్రోమో కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు షానీ జర్నీ వీడియో కనిపించడంతో చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వీడియో చూసిన వారు తమ కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. "ఏంది ఈ జర్నీ వీడియో, 'దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగాయంట' అన్నట్టుగా ఇప్పుడు వదిలారు జర్నీ వీడియో" అంటూ ఒకరు కామెంట్ చేసారు. " రేయ్.. ఎవర్రా మీరంతా.. ఎప్పుడో మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చిన షానీ సల్మాన్ జర్నీ వీడియో ఇప్పుడు వదిలారేంట్రా" అంటూ మరొకరు కామెంట్ చేసారు. "సీజన్ స్టార్టింగ్ లో అప్లోడ్ చేస్తే సీజన్ ఎండింగ్ లో అప్లోడ్ అయ్యింది.. 1G స్పీడ్ అనుకుంటా" అంటూ మరొకరు కామెంట్ చేయగా, "ఇన్ జస్టిస్ ఫర్ షానీ సల్మాన్.. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్" అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇలా నెటిజన్లు ట్రోల్స్ మీద ట్రోల్స్ తో ట్రెండింగ్ క్రియేట్ చేస్తోన్నారు.