English | Telugu
శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకొచ్చేస్తుందా!
Updated : Dec 14, 2022
హోరా హోరీగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్-6 చివరి దశకి చేరుకుంది. అయితే ఈ వారంలోనే గ్రాండ్ ఫినాలే కావడంతో ఆ పనుల్లో బిజీ అయిపోయిన బిగ్ బాస్, అందులో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు.
సోమవారం నుండి బుధవారం వరకు జరిగే ఓటింగ్స్ లో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు ఫినాలే రేస్ నుండి అవుట్ అని బిగ్ బాస్ చెప్పగా, శ్రీసత్య అందరి కన్నా తక్కువ ఓట్లతో లీస్ట్ లో ఉంది. దీంతో తనే కచ్చితంగా బయటకొచ్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఓటింగ్ పరంగా చూస్తే.. ఇప్పటివరకు రోహిత్, శ్రీసత్య, కీర్తి లీస్ట్ లో ఉండగా.. నిన్నటి ఎపిసోడ్‌లో రోహిత్ జర్నీ వీడియో చూసి చాలా మంది ఫ్యాన్స్ కూడా రోహిత్ కి ఓట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఓటింగ్ లో రోహిత్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇక కీర్తిభట్, శ్రీసత్య మధ్య స్వల్ప ఓట్ల తేడానే ఉండటంతో ఎవరు బయటకొస్తారనేది ఇప్పటికైతే సస్పెన్స్ గా ఉంది. కాగా సోషల్ మీడియాలో ఇప్పటికే 'శ్రీసత్య ఎలిమినేటెడ్' అంటూ పోస్ట్ లు కనిపిస్తుండటంతో తనే ఎలిమినేట్ అని నమ్మేవాళ్ళు లేకపోలేదు.