English | Telugu

రోహిత్ అమేజింగ్ జర్నీ!

బిగ్ బాస్ హౌస్ లోకి మెరీనా-రోహిత్ జంటగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వారాలు గడిచిన తర్వాత.. వీరిద్దరిని సెపరేట్ చేసి గేమ్స్, టాస్క్ లు ఆడించాడు బిగ్ బాస్.

ఆ తర్వాత మెరీనా ఎలిమినేట్ అయ్యింది. రోహిత్ హౌస్ లో ఒంటరిగా మిగిలాడు. ఇక అప్పటి నుండి రోహిత్ తనలో ఉన్న ఇంట్రోవర్ట్ ని పక్కన పెట్టి.. మెల్లి మెల్లిగా హౌస్ మేట్స్ అందరితో కలవడం మొదలుపెట్టాడు. అయితే మొన్నటి ఫ్యామీలి వీక్ ఎపిసోడ్‌లో రోహిత్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు "రోహిత్ బేటా నిన్ను కెప్టెన్ గా చూడాలనుకుంటున్నా.. ఒక్కసారి కెప్టెన్ గా ఉండు బేటా" అని చెప్పింది. ఆ డ్రీమ్ కూడా నెరవేరలేదు. అయితే ఇప్పుడు ఫినాలే వరకు వచ్చాడు రోహిత్.

బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి రోహిత్ ని పిలిచి, అతని జర్నీ వీడియోని చూపించాడు. "రోహిత్.. కంఫర్ట్ జోన్ నుండి బయటకొచ్చిన మీకు.. ఈ ప్రయాణంలో తోడు లభించింది. మీ ఆట మెరుగుపరుచుకోడానికి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. కెప్టెన్ కావాలనేది మీ అమ్మ గారి కల.. కానీ ఆ కల నెరవేరలేదు. అది మీ మనసుకి బాధ కలిగించింది. కానీ మీరు ఇప్పుడు ఫినాలేలో ఉన్నారు.‌ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. హౌస్ లో ఫ్రెండ్స్ కలిసి ఆడినప్పుడు తప్పు అనిపించలేదు. కానీ మీరు ఇద్దరు కలిసి ఆడితే ఎందుకు చర్చనీయాంశం అయ్యిందో అర్థం కాలేదు. అయినా మీరు మీ సహనాన్ని కోల్పోలేదు" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రోహిత్ "థాంక్స్ బిగ్ బాస్.. థాంక్స్ మెరీనా.. థాంక్స్ ఫ్యాన్స్" అని చెప్పాడు.