English | Telugu
హిమ చెప్పిన నిజం.. షాకైన సౌందర్య!
Updated : Jun 21, 2022
గత ఎపిసోడ్ లో జ్వాలకు నిజం చెప్పాలనే ఉద్దేశ్యంతో నిరుపమ్.. జ్వాలని "పద వెళతాం" అంటూ హిమ ముందే పిలుస్తాడు. జ్వాల సిగ్గుపడుతూ వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. హిమ కంగారుపడుతూ "నేనూ వస్తాను" అని అడ్డుపడుతుంది. తీరా జ్వాల.. హిమని తీసుకుని వెళ్లకుండా నిరుపమ్ ని తీసుకుని వెళ్లడంతో కథ రసవత్తర మలుపులు తిరిగింది. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక సారి చూద్దాం. హిమ క్యాన్సర్ ఓ నాటకమని సౌందర్యకు తెలుస్తుంది. ఆ తరువాత తను ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం.
హిమ క్యాన్సర్ బారిన పడింది అన్నది ఓ నాటకమని సౌందర్యకు తెలుస్తుంది. దీంతో తనని పిలిచిన సౌందర్య లాగిపెట్టి చెంప ఛెళ్లుమనిపిస్తుంది. దీంతో హిమ, ఆనందరావు షాకుకు గురవుతారు. వెంటనే తేరుకున్న ఆనందరావు `దాన్ని ఎందుకు కొట్టావు` అంటూ సౌందర్యని నిలదీస్తాడు. వెంటనే `అంతా తెలిసిపోయింది హిమా` అని సౌందర్య అరుస్తుంది. ఆ మాటలు విన్న హిమ `నానమ్మా` అంటుంది భయం భయంగా.. అదే సమయంలో సౌందర్య.. 'నీకు క్యాన్సర్ లేదు' అని అరుస్తుంది. అక్కడే వున్న నిరుపమ్, స్వప్న, ఆనందరావు షాక్ అవుతారు.
'మా కళ్లకు గంతలు కట్టి ఎందుకీ నాటకం?' అంటుంది సౌందర్య కోపంగా... 'చెబుతావా లేక..' అంటూ మరోసారి హిమ పైకి చేయి లేపుతుంది. వెంటనే `శౌర్య ఎవరో ఎక్కడుందో నాకు తెలుసు` అంటూ నోరు విప్పుతుంది హిమ. ఆ మాటలకు సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. సౌందర్యని శౌర్య పేరుతో శోభ బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని గ్రహించిన హిమ అసలు విషయం బయటపెట్టేందుకే సిద్ధపడుతుంది. కట్ చేస్తే.. నిరుపమ్, జ్వాలతో మాట్లాడుతుంటే సౌందర్య, హిమ వింటారు. ఇదే సమయంలో హిమ ఓ నిజం చెబుతుంది. అదేంటీ?.. ఆ నిజం విని సౌందర్య ఎందుకు షాక్ కు గురైంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.