English | Telugu

మారుతీ నెక్స్ట్ మూవీలో పాట పాడే ఆఫర్ కొట్టేసిన కీర్తిభట్

తెలుగు ఆడియన్స్ కి కీర్తి భట్ అంటే ఎవరో తెలీదో కానీ భాను అంటే చాలు గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే మానసిచ్చి చూడు సీరియల్ లో భాను పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కీర్తి. బెంగళూరులో పుట్టిన కీర్తికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకుంది. చదువైపోయాకు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూడు సీరియల్స్ చేసింది. ఐతే కొన్నేళ్ల క్రితం కీర్తి తన వాళ్ళను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయింది. ఒక కారు ప్రమాదంలో కీర్తి తల్లితండ్రులతో పాటు అన్నయ్య, వదినను దూరం చేసుకుంది. కీర్తి కూడా ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు కోలుకుని మానసిచ్చి చూడు అనే సీరియల్ లో యాక్ట్ చేసింది. ఇటీవల ఫాథర్స్ డే సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన మొగుడ్స్ పెళ్లామ్స్ షోలో "వెలుగు, చీకటిలోన తోడై నిలిచే నాన్న అంటూ పాట పాడి " బాగా ఎమోషన్ అయ్యింది కీర్తి. పాట చాలా బాగా పాడిందంటూ రాశిఖన్నా, గోపీచంద్, మారుతి మెచ్చుకున్నారు.

మారుతి కూడా వాళ్ళ నాన్న గురుంచి ఈ షోలో చెప్పుకొచ్చారు. ఇక కీర్తి ఇన్వాల్వ్ అయ్యి ఇంత చక్కగా పాడినందుకు మారుతి తన నెక్స్ట్ మూవీలో ఒక సాంగ్ ని కీర్తితో పాడిస్తానంటూ మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. "ఆడపిల్లలకు నాన్న అంటే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి తలుపు కొడితే నాన్న తలుపు తీస్తారేమో అని ఎదురు చూస్తుంటాను. వాళ్ళు రారని, లేరని తెలుసు కానీ చిన్న ఆశ ఉంది. పేరెంట్స్ లేకపోతె ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు. దయచేసి పేరెంట్స్ ఎవరూ బాధపెట్టొద్దు, వాళ్ళను బాగా చూసుకోండి ..ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోండి..ఈ రోజు నేను ఈ స్టేజి మీద ఉన్నాను అంటే అది మా నాన్న , స్టార్ మా వల్ల" అంటూ చెప్పుకొచ్చింది కీర్తి భట్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.