English | Telugu
73 దారులన్నీ మూసేసిన రాగసుధ!
Updated : Jun 21, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో కూపొందిన ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తకర మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నటించి ఈ సీరియల్ ని నిర్మించారు. వర్ష హెచ్ కె. అతనికి జోడీగా నటించింది. ఇతర పాత్రల్లో జయలలిత, జ్యోతి రెడ్డి, బెంగళూరు పద్మ, రామ్ జగన్, విశ్వమోహన్, అనుషా సంతోష్, వరణ్, మధుశ్రీ, ఉమాదేవి, సందీప్ నటించారు.
రాగసుధ నుంచి తప్పించుకోవాలంటే తమ వద్ద వున్న ఒకే ఒక్క ఆయుధం ఆస్తి డాక్యుమెంట్స్. వాటితో తనకు చెక్ పెట్టాలని ఆర్య వర్థన్ ప్లాన్ చేస్తాడు. ఇదే విషయం అను, జెండేలకు చెప్పి ఇంట్లో రాజనందని గదిలో వున్న డాక్యుమెంట్లని తీసుకుని నేరుగా కోర్టుకు రమ్మని చెబుతాడు. అయితే ఇంటికి వచ్చి రాజనందని గదిలో వెతికిన అను షాక్ కు గురవుతుంది. గతంలో తనని మాటల్లో పెట్టి రాగసుధ ఆస్తి డాక్యుమెంట్లని తెలివిగా కొట్టేసిందన్న విషయం గుర్తిస్తుంది. ఆ విషయం జెండే తో పాటు మాన్సీ, ఆర్య వర్థన్ మదర్ కు చెబితే మాన్సీ, ఆమె తల్లి హేళన చేస్తారు. కావాలనే రాగసుధ తో చేరి ఇదంతా చేశావంటూ నిందిస్తారు.
అను సంజాయిషీ చెప్పబోతుంటే చేసింది చాలు అను అంటూ జెండే అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ఇంతలో రాగసుధ ఆస్తి డాక్యుమెంట్లతో కోర్టులో ప్రత్యక్ష్యం అవుతుంది. దారులన్నీ మూసుకుపోవడంతో ఆర్య న్యాయమే గెలుస్తుందని చెబుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? రాగసుధ కుట్ర కారణంగా ఆర్య ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడా?.. లేక రాగసుధ కుట్ర బయటపడి ఆర్య ఆస్తిని దక్కించుకున్నాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.