English | Telugu
శ్రీహాన్ ని కన్నా అని ఎప్పటినుంచి పిలుస్తున్నావ్?
Updated : Oct 1, 2022
శ్రీహాన్-సిరి రిలేషన్ గురించి అందరికీ తెలుసు. ఇక వీళ్ళ మధ్య ప్రేమ ఉంది...మరి పెళ్లి ఎప్పుడు అని నెటిజన్స్ నుంచి వస్తున్నా ప్రశ్నలకు బాస్ హౌస్ నుంచి శ్రీహాన్ బయటికి వచ్చాక అంటూ రీసెంట్ గా సిరి హన్మంత్ చెప్పింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి ఇంట్లోకి వెళ్లి గేమ్ ఆడింది. ఐతే అక్కడ షన్నుతో ప్రేమాయణం నడిపేసరికి షన్ను-దీప్తి విడిపోయారు..సిరి-శ్రీహాన్ కూడా విడిపోయారు. ఐతే తర్వాత ఇదంతా అర్ధం చేసుకున్న శ్రీహాన్ మాత్రం సిరితో తన రిలేషన్ కంటిన్యూ చేసాడు కానీ షన్ను-దీప్తి మాత్రం ఇంకా కలవనే లేదు. ఐతే ఇటీవల సిరి సోషల్ మీడియాలో తన పాపులారిటీని యూజ్ చేసుకుని శ్రీహాన్ ని గెలిపించడానికి తెగ ట్రై చేస్తోంది.
అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఇక ఇప్పుడు నెటిజన్స్ ని "ఆస్క్ మీ ఆ క్వశ్చన్" పేరుతో చాట్ చేసింది. అందులో ఒక నెటిజన్ "శ్రీహాన్ ని ఎప్పటినుంచి కన్నా అనడం స్టార్ట్ చేసావ్" అని అడిగేసరికి "మొదట్లో నాన్న అని పిలిచేదాన్ని దాంతో ఛీ నన్ను అలా పిలవకు అన్నాడు..అప్పటినుంచి కన్నా అనడం స్టార్ట్ చేశా" అంటూ రిప్లై ఇచ్చింది. "శ్రీహాన్ పుట్టినరోజుకి బిగ్ బాస్ హౌస్ కి వస్తారా" అన్న ప్రశ్నకు "వాళ్ళు పిలవాలిగా చూద్దాం" అంది సిరి. "వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా వదిన" అని మరో నెటిజన్ అడిగేసరికి "అమ్మబాబోయ్ మన వల్ల కాదు" అంటూ ఫన్నీ ఫన్నీ రిప్లైస్ ఇచ్చేసింది సిరి.