English | Telugu
ఏం మాట్లాడుతున్నావ్...యాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన ఆరోహి!
Updated : Oct 3, 2022
బిగ్ బాస్ షో మీద ఎన్ని కామెంట్స్ వచ్చినా డోంట్ కేర్ అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ మామూలుగానే జరిగిపోయాయి. ఆరోహి రావు హౌస్ లోంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది. ఇక ఆమె బయటికి రావడంతోనే బీబీ కేఫ్ లో సంచలన కామెంట్స్ చేసింది.
శ్రీహాన్, కీర్తితో తాను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయని చెప్పింది. అలాగే మనీ కోసం, మంచి ఫామిలీ కోసం హౌస్ లోకి వెళ్ళానంది. "ఇండివిడ్యువల్ గేమ్ ఆపేసిన దగ్గర నుంచి నీ గ్రాఫ్ పడిపోయింది" అంటూ యాంకర్ అనేసరికి ఆరోహి ఆ విషయాన్ని కొట్టి పడేసింది. ఇక హౌస్ లో ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళ ఫొటోస్ ని విరగొట్టేసింది. "సుదీప అక్క డామినేటింగ్ గా అనిపిస్తుంది. ఆమె వాయిస్ అంతే కానీ" అంటూ ఆమె ఫోటో విరగొట్టేసింది.
"హౌస్ లో ఉన్నన్ని రోజులు నామినేట్ చేశా కానీ ఈయన ఉండాలి ఆడాలి, ఆట తెలిసిన వ్యక్తి కాబట్టి" అంటూ రేవంత్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఫోటో పక్కన పెట్టింది. "శ్రీహాన్ చాలా బాగా ఆడతాడు. టాప్ 5 వరకు వెళ్తాడు అందులో డౌట్ లేదని చెప్పి" అతని ఫోటో పక్కన పెట్టింది. "హౌస్ లో ఆరోహి మితిమీరింది" అని అర్ధమవుతోంది అని యాంకర్ అనేసరికి "సూర్యది నాది ప్యూర్ ఫ్రెండ్ షిప్" అంది. "అంత ప్యూర్ అని ఎవరికీ అనిపించలేదు" అని సీరియస్ గా అడిగాడు యాంకర్.
పచ్చ కామెర్ల వాడికి లోకం మొత్తం పచ్చగా కనిపిస్తుంది. "చేసేది కరెక్ట్ ఐతే ఎవరూ మాట్లాడుకోరు కదా" అని రివర్స్ లో యాంకర్ అడిగేసరికి "అలా ఎవ్వరు అన్నా కూడా అస్సలు ఊరుకోను, అది ఇంటర్వ్యూ ఐనా సరే ఊరుకోను". "ఫైర్ బ్రాండ్ లా వెళ్లాను అలాగే బయటికి వచ్చాను" అంటూ సీరియస్ గా చెప్పింది ఆరోహి.