English | Telugu
షకీలా కన్నడ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్
Updated : Sep 6, 2023
షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోల్డ్ మూవీస్ కి సెంటరాఫ్ అట్రాక్షన్, కేరాఫ్ అడ్రెస్స్ ఏదైనా చెప్పొచ్చు. బోల్డ్ మూవీస్, బోల్డ్ సీన్స్ అనే పేరు వస్తే మొదటిగా గుర్తొచ్చే నటి షకీలా మాత్రమే. ఇక ఆమె కానీ ఆమె మూవీస్ కానీ సృష్టించిన సెన్సేషన్ మామూలు కాదు. మలయాళంలో షకీలా సినిమా రిలీజ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేది. ఎందుకంటే ఆమె మూవీ రిలీజ్ అంటే మిగతా మూవీస్ ఆడవు కలెక్షన్స్ రావు అనే భయం ఉండేది. దాని కారణంగా ఆమె సినిమాలను బ్యాన్ చేసింది మాలీవుడ్. షకీలా కూడా మరో దారి లేక మూవీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
షకీలా లైఫ్ ఎప్పుడూ ట్రాజెడీగానే ఉంటూ వచ్చింది . ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్ని కాంట్రవర్సీలే. కస్టపడి నటించగా వచ్చిన డబ్బును సొంత అక్క తీసేసుకుని మోసం చేసింది. అలాంటి షకీలా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడింది. సినిమాల్లో ఉన్నట్టే షకీలా ఉంటుందని అనుకుంటారు చాలామంది కానీ అలా ఉండదు. అలా ఎన్నో కష్టాలు పడిన ఆమె బిగ్ బాస్ కన్నడలోని 2వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు . షకీలాకు మలయాళ నటిగా మంచి గుర్తింపు ఉంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆమె ఎన్నో మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ లో నటించారు. అందుకే బిగ్ బాస్ కన్నడ టీమ్.. బిగ్ బాస్ కన్నడ ఇప్పటికి 9 సీజన్లు పూర్తి చేసుకుంది.
అంటే షకీలా 2014 లో కన్నడ బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ వెళ్లారు అంటే .. దాదాపు 7 ఏళ్లు క్రితమే షకీలా బిగ్ బాస్ హౌస్‌ను చూసేసిందన్నమాట..అలాంటి ఆమె ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ అంటే పెద్దగా భయపడాల్సిన పని లేదు అని అర్ధం . ఐతే కన్నడ బిగ్ బాస్ లో షకీలా.. 26 రోజులు మాత్రమే హౌజ్ లో ఉన్నారు 27వ రోజు ఎలిమినేట్ ఇపోయారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ 7 సీజన్‌తో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చారు. మరి ఈ సీజన్ లో ఎన్ని రోజులు ఉంటారో గేమ్ అసలు ఎలా ఆడతారో చూడాలి. ఆమె వయసు కూడా చాలా పెద్దది. వయసులో ఉన్నవాళ్లు గేమ్స్ ఆడినట్టు ఆమె ఆడలేరు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ ఎందుకు సెలెక్ట్ చేశారో అంతుబట్టని విషయం...