English | Telugu

నీకోసం యుద్ధం చేస్తాను...నా సెల్ ఫోన్ మాత్రం ఇవ్వను

వినాయక చవితి పండగ రాబోతున్న తరుణంలో మల్లెమాల కొత్త ఈవెంట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ప్రతీ ఫెస్టివల్ ని ఒక పండగలా కళకళలాడుతూ చేస్తుంది మల్లెమాల టీమ్. ఇక త్వరలో "స్వామి రారా" పేరుతో ఒక షో రాబోతోంది. దానికి సంబంధించి మరో కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో చాలామంది నటీనటులు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇక ఈ షోకి బేబీ మూవీలో లాస్ట్ సీన్ లో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఆ హీరో కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈ ఈవెంట్ కి చాందిని చౌదరి కూడా వచ్చింది .

ఆమె రాగానే అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యి అని ఆదికి చెప్పింది శ్రీముఖి. "నన్ను ఇంప్రెస్స్ చేయడమంటే అంత ఈజీ కాదు" అని చెప్పింది చాందిని. "నాకోసం యుద్దాలు చేయాలి, త్యాగాలు చేయాలి" అని కూడా చెప్పింది. "ఏమైనా చేసేస్తా" అని ఆది కొంచెం ఎక్సట్రా చేసేసరికి "ఐతే నీ ఫోన్ ఇవ్వు" అంది చాందిని "అమ్మో ఆ త్యాగం చేస్తే నా లైఫ్ ఆగమాగం ఐపోతుంది..వద్దు" అన్నాడు. దానికి చాందిని కిలకిలా నవ్వేసింది.

ఇక ఈ షోకి గెస్టులుగా వచ్చిన నరేష్, పవిత్ర గులాబీ పూలు ఇచ్చుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. ఇక లాస్ట్ బేబీ మూవీ స్పూఫ్ చేశారు. కానీ అంత వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా ఫారియా అబ్దుల్లా బులెట్ మీద ఎంట్రీ ఇచ్చింది. ఫారియా రీసెంట్ గా "ది జంగబూరు కర్స్" అనే వెబ్ సిరీస్ లో అద్భుతంగా నటించింది. ఫారియా రావడంతోనే "ఇండియా ఈజ్ మై కంట్రీ..ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్" అని చెప్పి రాంప్రసాద్ బ్రదర్ అన్నట్టుగా అతని మీద చెయ్యేసేసరికి రాంప్రసాద్ ఆమె చేతిని పక్కకు తోసేసాడు. బేసికల్లి ఒక రేంజ్ కి వెళ్ళాక మాటలుండవ్ మోతలే అంటూ శ్రీముఖి చెప్పిన డైలాగ్ తో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోలో నరేష్, పవిత్ర, ఆది, రాంప్రసాద్ మధ్య ఎలాంటి కామెడీ కంటెంట్ క్రియేట్ అయ్యిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.