English | Telugu

Guppedantha Manasu:ఇంటరాగేషన్ లో ముకుల్ కి షాకిచ్చిన శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -943లో.. ఇంటరాగేషన్ కోసం శైలేంద్ర దగ్గరికి ముకుల్ వస్తాడు. ఇక అన్ని ప్రశ్నలతో ముకుల్ శైలేంద్రని టెన్షన్ పెడుతాడు. చివరికి జగతి హత్యకి సంబంధించి రౌడీతో శైలేంద్ర ఫోన్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందరి ముందు ఆ వాయిస్ నీదేనా అని ముకుల్ అడుగుతాడు. నాదే అని శైలేంద్ర అనగానే.. ఎంత పని చేసావు రా అంటూ ఫణీంద్ర శైలేంద్రపై చెయ్యి చేసుకుంటాడు.

ఆ తర్వాత ఇక అన్ని నిజలు బయటపడుతాయని మహేంద్ర, వసుధారలు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక స్టేషన్ కి వెళదామా తప్పు ఒప్పుకున్నారు కదా అని ముకుల్ అనగానే.. వస్తాను ఒక నిమిషం అంటూ మమ్మీ నా ఫోన్ తీసుకోని రా అని చెప్పగానే దేవయాని ఫోన్ తీసుకోని వస్తుంది. నేను హాస్పిటల్ లో ఉండగా నాకు ఒక ఫోన్ వచ్చింది అంటు ఒక వాయిస్ రికార్డింగ్ ని వినిపిస్తాడు. అందులో జగతి కేసు లో మీరే నిందితుడుగా ఉన్నారు. మిమ్మల్ని తప్పిస్తాను. నాకు డబ్బులు ఇవ్వండి అంటు ముకుల్ వాయిస్ తో ఆడియో ఉండడం చూసి అందరు షాక్ అవుతారు. ఆ వాయిస్ నాది కాదని ముకుల్ అంటాడు. మీరు ఇప్పుడు వినిపించింది నా వాయిస్ అయినప్పుడు ఇది మీ వాయిస్ ఎందుకు కాదని శైలేంద్ర అంటాడు. మంచికే కాదు చెడుకి కూడా టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. ఎవరు ఈ పని చేస్తున్నారో అంటు శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్రకి‌ రిషి ఫోన్ చేసినట్లుగా మరొక రికార్డింగ్ ని శైలేంద్ర వినిపిస్తాడు. అందులో ఎండీ చైర్ లో వసుధారని కూర్చోపెట్టడానికి జగతిని తొలగించాను. ఇప్పుడు నిన్ను కూడా అడ్డు తొలగించాలని ఇలా ఎటాక్ చేసానని రిషి మాట్లాడినట్టుగా ఆ వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. రిషి అలాంటి వాడు కాదని మహేంద్ర అంటాడు. రిషి అలాంటి వాడు కాదని నాక్కూడా తెలుసు. ఎవరో మన కుటుంబంపై ఇలా చేస్తున్నారు. నాపై ఎటాక్ చేసినప్పుడు.. మీ కుటుంబంలో ఎవరిని వదిలి పెట్టానంటూ చెప్పి వెళ్ళారని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి అసలు ఎక్కడ ఉన్నాడో? బ్రతికి ఉన్నాడో? లేదో అనగానే వసుధార కోపంగా.. ఆపండి ఇంకొసారి రిషి సర్ గురించి అలా మాట్లాడకండి. రిషి సార్ కీ ఏమైనా అయితే ఎవరిని వదిలి పెట్టనని వసుధార వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ముకుల్ అన్ని విషయలు కనుక్కుంటాను. మీకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి ఎంక్వయిరీ చేస్తానంటూ చెప్పి ముకుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత వసుధార, మహేంద్ర.. ఇంత నాటకం ఆడిన శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. ముకుల్ కి నిజం తెలిసిపోయిందని ఇదంతా డ్రామా క్రియేట్ చేసాడని అనుకుంటారు. రిషి సర్ ఇంకా రాలేదని వసుధార టెన్షన్ పడుతు‌ ఉంటుంది. మరొక వైపు దేవయాని హ్యాపీగా శైలేంద్ర దగ్గరికి వెళ్లి... ఏం ప్లాన్ చేశావ్ నాన్న అంటూ మెచ్చుకుంటుంది. అప్పుడే ధరణి డోర్ కొడుతుంది. దేవయాని వెళ్లి డోర్ తియ్యగానే ధరణి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.