English | Telugu

అన్యాయం జరిగితే ఎదిరిస్తా కానీ గాంధీ చెప్పినట్టు నా చెంప చూపించను!


సాయికిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయంత్రం స్టార్ మాలో వచ్చే 'గుప్పెడంత మనసు' సీరియల్ చూస్తే తెలిసిపోతుంది. మహేంద్ర రోల్ లో చాలా చక్కగా నటిస్తూ ఆడియన్స్ మనసును దోచుకున్నారు. ఆయనొక సింగర్, యాక్టర్. ఒకప్పుడు బిగ్ స్క్రీన్ మీద చేసి, ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద షోస్, ఈవెంట్స్ , సీరియల్స్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా, ఇప్పుడు ఆయన గాంధీకి సంబంధించి ఒక కామెంట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. "నేను గాంధీజీకి కానీ, ఆయన ఉద్దేశించిన విధానాలకు నేను పెద్ద అభిమానిని కాదు. అన్యాయం జరిగినప్పుడు ఎదిరిస్తాను కానీ నా చెంపను చూపించి దెబ్బల కోసం ఎదురు చూడను" అంటూ తనదైన స్టయిల్లో పోస్ట్ చేశారు.

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'నువ్వే కావాలి'తో న‌టునిగా ప‌రిచ‌య‌మైన‌ సాయి కిరణ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని మూవీస్ లో నటించాడు. ఈటీవీలో ప్రసారమయ్యే 'శివ లీలలు' సీరియల్ లో విష్ణు మూర్తి క్యారక్టర్ లో నటించాడు. మలయాళం, తమిళ సీరియల్స్ కూడా సాయికిరణ్ నటించాడు. ఆయ‌న దివంగ‌త గాయ‌కుడు రామ‌కృష్ణ కుమారుడు.