English | Telugu

జిమ్ము కట్టి చూడు.. జిమ్ము చేసి చూడు.. ఇది ప్రగతి మాట!

ప్రగతి ఆంటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ ఐపొతూ ఉంది. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె చేసే జిమ్ వర్కౌట్స్ చూస్తే చాలు. ఏమాత్రం టైమ్ దొరికినా జిమ్ లో ప్రత్యక్షమై వ‌ర్క‌వుట్స్‌ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో విడుదలయ్యింది. ఈ షోకి జడ్జిగా వచ్చి ప్రగతి నవ్వులు పూయించింది. ఇక ఈ ఎపిసోడ్ లో రాఘవ స్కిట్ గురించి ఒక్క మాటలో చెప్పలేం. అంత హిలేరియస్ గా ఉంది ఈ స్కిట్. రాఘవ ఈ స్కిట్ ని వెరైటీ గా పెర్ఫామ్ చేసాడు.

స్టేజి మీద ఎక్సరసైజ్లు చేస్తూ "ప్రగతి మేడం ఎప్పుడు చూసినా మీరు జిమ్ లోనే ఉంటారు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది పాత మాట మేడం, జిమ్ముకట్టి చూడు.. జిమ్ము చేసి చూడు అనేది ప్రగతి మాట అండి" అంటాడు. ఇంతలో రాఘవ అసిస్టెంట్ వచ్చి "ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయాలి జిమ్ములు" అంటాడు రాఘవతో. "ప్రగతి మేడంని అంత మాట అంటావా?" అంటాడు రివర్స్ లో రాఘవ. "నేను ప్రగతి గారిని అనలేదు నిన్ను అన్నాను" అంటాడు అసిస్టెంట్. తర్వాత నాగి అక్కడికి వస్తాడు. "మా దగ్గర ఒక గెస్ట్ ఉన్నాడు. అతన్ని ఒక మూడు రోజులు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు" అని రాఘ‌వ అనేసరికి, "మా ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది. ఐదు వేలు ఇచ్చి అందులో ఉంచు" అంటాడు నాగి.

వెంటనే డబ్బులు ఇచ్చేసి ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడతాడు. "ఇదిగోండి గెస్ట్ వచ్చేసాడు" అనేసరికి, "ఏమిటి మందు తాగి పడిపోయాడా?" అని అడిగాడు నాగి. "కాదు పురుగుల మందు తాగి పడిపోయాడు" అని చెప్తాడు రాఘవ. "ఇదేంటి లేవడం లేదు" అని డౌట్ తో అడిగాడు నాగి. "శవం ఎలా లేస్తుంది?.. ఐనా మార్చురీలో పని చేసే నేను శవాల్ని కాక పప్పు చెక్కల్ని తెచ్చి పెడతాను ఏమిటి" అంటాడు. ఆ మాటకు షాక్ ఐపోతాడు నాగి.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.