English | Telugu

 రాజ‌నందిని ఎవ‌ర‌న్న అను, షాక్ కు గురైన ఆర్య, ఆర్య‌త‌ల్లి!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొంత కాలంగా జీ తెలుగులో ప్ర‌సారం అవుతోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ఆద్యంత ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ బంచి రేటింగ్ తో సాగుతోంది. వెంక‌ట్ శ్రీ‌రామ్ న‌టించి నిర్మించారు. వ‌ర్ష కీల‌క పాత్ర‌లో న‌టించగా ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతి రెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, రాధాకృష్ణ‌, అనూషా సంతోష్ త‌దిత‌రులు న‌టించారు.

రాజీనే అని బ‌లంగా న‌మ్మిన ఆర్య వ‌ర్థ‌న్ త‌న‌ని త‌న ఇంటికి ఒప్పందం ప్ర‌కారం తీసుకొస్తాడు. అయితే రాజీ చేసే ప‌నులు, మాట్లాడే తీరు ఆర్య‌కు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ వుంటుంది. ఆర్య బెడ్రూమ్ నుంచి చాప తీసుకుని బ‌య‌ట‌ప‌డుకోవ‌డానికి రెడీ అవుతూ వుంటుంది. ఇంత‌లో ఆర్య త‌ల్లి మాలినీదేవి ఎంట్రీ ఇస్తుంది. అది గ‌మ‌నించిన రాజీ ఈ టైమ్ లో ఇక్క‌డికి వ‌చ్చారేంటీ? అని అడుగుతుంది. రాకూడ‌ని టైమ్ లో వ‌చ్చి డిస్ట్ర‌బ్ చేశానా? అని మాలిని దేవి అంటుంది.

అదే స‌మ‌యంలో రేపు హోమంలో ఇద్ద‌రు కూర్చుంటున్నారు క‌దా? మీ ఇద్ద‌రితో పాటు పంతులు గారు పూజ‌లో రాజ‌నంద‌ని ఫొటోని కూడా పెట్టాల‌న్నారు. ఇలా చేయ‌మ‌ని మ‌రీ మ‌రీ చెప్పారంటుంది. వెంట‌నే రాజీ.. రాజ‌నంద‌ని ఎవ‌రు ? అంటుంది. ఆ మాట‌తో ఆర్య‌, ఆర్య త‌ల్లి మాలినీదేవి ఒక్క‌సారిగా షాక్ అవుతారు. ఆ త‌రువాత అదేంటి అను రాజ‌నంద‌ని నీకు తెలియ‌దా ? అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఆ మ‌ట‌లు విన్న రాజీ ఎందుకు తెలియ‌దు త‌ను మీ కూతురు క‌దా అనడంతో ఆర్య‌, ఆర్య త‌ల్లి మ‌రింత‌గా షాక్ కు గుర‌వుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.