English | Telugu

మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చినవేళ.. రిషి తప్పుగా అర్థం చేసుకున్నాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -746లో.. రిషి, వసుధారలు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. కంగ్రాట్స్ మెడికల్ కాలేజీ ఎం.డి అని మినిస్టర్ అనగానే రిషి సంతోషంతో ఆశ్చర్యపోతాడు. మెడికల్ కాలేజీ పర్మిషన్ వచ్చిందంటూ పర్మిషన్ లెటర్ ని రిషి కి ఇస్తాడు మినిస్టర్. ఇదెలా సాధ్యమని రిషి అడుగుతాడు. ఇందులో మీ తల్లి, నీ భార్య వసుధార కృషి ఉందని మినిస్టర్ అంటాడు. నువ్వు ఏమైనా అనుకుంటే.. మీ ఫ్యామిలీ దానిని నిజం చెయ్యడానికి కష్టపడుతారు.. నువ్వు ఒక మంచి పనికోసం ఆ సౌజన్యరావుతో చేతులు కలపాలనుకున్నావ్ కానీ ఆ సౌజన్యరావు ఒక ఫ్రాడ్ అని తెలిసింది. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి నన్ను పిలవండని మినిస్టర్ అనగానే.. సరే అని రిషి చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత వసుధార, మహేంద్ర, జగతిలు ఒక దగ్గర నిల్చొని మాట్లాడుకుంటారు. రిషి మనపై కోపంగా ఉన్నాడు.. నువ్వు వెళ్ళి మాట్లాడమని మహేంద్రతో జగతి అనగానే.. అంతలోనే రిషి వచ్చి.. ఏంటి వసుధార నాతో చెప్పకుండా ఇదంతా ఎందుకు చేశారు? ఆ సౌజన్యరావు గురించి మీరు ముందే ఊహించారు కదా? ఆ సౌజన్యరావు మోసం గురించి నాకెందుకు చెప్పలేదు? నేను అతని చేతుల్లో మోసపోయేవాణ్ణి కాదు కదా.. ముందే చెప్పాలి కదా మీరందరు నన్ను లెక్క చెయ్యరు.. మెడికల్ కాలేజీ నా కల నువ్వు నెరవేర్చలేవు.. మేము నెరవేరుస్తామని నన్ను చేతకానివాడిలా అనుకుని ఇదంతా చేశారు కదా అని రిషి కోపంగా అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార బస్తీ విజిటింగ్ ఉందని వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత వసుధార స్కూటీని ఓవర్ టేక్ చేసి ఒక టాక్సీ వేగంగా వెళ్తుంది. ఇంతలో ఒక అతనికి యాక్సిడెంట్ చేస్తాడు టాక్సీ డ్రైవర్.. అయినా పట్టించుకోకుండా టాక్సీ వెళ్లేసరికి.. వసుధార చూసి టాక్సీని దాటేసి.. తన స్కూటీని ఆ ట్యాక్సీకి అడ్డంగా పెట్టి.. డ్రైవర్ ని తిడుతుంది. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండని వసుధార అనగానే.. టాక్సీ లోపల ఉన్న ఒక అజ్ఞాతవ్యక్తి.. అందులో నుండి దిగుతాడు. ఆ వ్యక్తితో వసుధారకి గొడవ జరుగుతుంది. వెంటనే కార్ లోని ఆ అజ్ఞాతవ్యక్తి వసుధార మాటలు పట్టించుకోకుండా.. వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. టాక్సీ డ్రైవర్ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు.మరొకవైపు మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇదంతా ఎలా చేశారు అంటూ జగతిని అడుగుతాడు‌ మహేంద్ర. ఇక జగతి జరిగిందంతా చెప్తుంది. సీక్రెట్ గా రిషితో సంతకం పెట్టించామని తెలిస్తే మన పుత్రరత్నం ఏం చేస్తాడో అని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.