English | Telugu

ఇంద్రజకి జనాల మధ్యలో సింపుల్ గా ఉంటేనే ఇష్టమట!

సీనియర్ నటి ఇంద్రజ గురించి ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరూ లగ్జరీ లైఫ్ ని కావాలనుకుంటారు. స్టార్ డమ్ తో జీవిస్తుంటారు. చుట్టూ ఎప్పుడు బౌన్సర్ ల మధ్యలో ఫుల్ సెక్యూర్ గా ఉంటారు. కానీ వారందరికి భిన్నంగా ఇంద్రజ ఉంటోంది.

ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీ బిజీగా గడుపుతుంది. ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కి జడ్జ్ గా, మరోవైపు 'జబర్దస్త్' కి జడ్జ్ గా వ్యవహరిస్తూ.. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేసి నవ్విస్తుంది. అంతే కాకుండా ఇటీవల చేసిన తన డ్యాన్స్ వైరల్ కావడంతో ఒక్కసారిగా మరింత పాపులర్ అయింది ఇంద్రజ. 'దసరా' మూవీలోని తీన్మార్ డాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసిన విషయమే. ఆ తీన్మార్ పాటకి ఇంద్రజ చేసిన డ్యాన్స్ స్టెప్పులు బుల్లితెర టీవీ ప్రేక్షకులని ఫిదా చేసాయంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఇంద్రజ డ్యాన్స్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. దాంతో ఇంద్రజలోని మరొక టాలెంట్ బయటకు వచ్చింది. మరింతగా క్రేజ్ పెరిగింది. మొదటి నుండి ఇంద్రజ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ తన‌ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తూ.. తన ఫాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తుంది.

అయితే ఇంద్రజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. అందులో రామాలయం టెంపుల్ ని చూపిస్తూ.. నాకు టైం దొరికినప్పుడు ఇక్కడికి వస్తాను.. అదీ నడుచుకుంటూ వస్తానని ఇంద్రజ ఆ వీడియోలో చెప్పింది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణంగా వచ్చేసింది ఇంద్రజ. మరొక వీడియోలో ఇంద్రజ నడిచి వెళ్తున్న వీడియో ఉంది. నాకు ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే సరదాగా ఉంటుంది.. నాకు ఇలా జనాల మధ్యలో ఒక జనం లాగా కలిసిపోయి తిరుగుతుంటే.. ఆ ఫీల్ అనేది డిఫరెంట్ గా ఉంటుందని ఆ వీడియోలో చెప్తూ పోస్ట్ చేసింది ఇంద్రజ. దీంతో ఈ పోస్ట్ చూసిన తన అభిమానులు ఇంత సింపుల్ గా ఉంటారేంటి మేడం అని అనుకుంటున్నారు. కాగా ఇంద్రజ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.