English | Telugu
BB Transport Task లో గెలిచిందెవరు?
Updated : Nov 18, 2022
ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో బిగ్ బాస్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అలాంటిది టాస్క్ ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఈ టాస్క్ లు ఎలా ఉంటాయంటే మిత్రులుగా ఉన్నవాళ్ళు, శత్రువులు అవుతారు. ఇప్పటికే దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా దూరం అవుతారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ఎపిసోడ్‌లో ఒక కొత్త టాస్క్ మొదలైంది. అదే 'BB Transport Task'.
ఈ టాస్క్ ఏంటంటే, "గార్డెన్ ఏరియాలో ఒక 'బిబి ట్రాన్స్ పోర్ట్' వాహనం ఉంది. ఒక్కో స్టాప్ కి మొదట ఎవరు ఎక్కి హారన్ కొడతారో? వారే కెప్టెన్సీ కంటెండర్ పోటీకి అర్హతను సాధిస్తారు. అందులో ఓడినవారు.. ఒక్కో సభ్యుడు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకొని వారిని ఈ గేమ్ లో నుండి తొలగించాలి. ఆ తర్వాత ఉన్నవాళ్ళు ఈ గేమ్ ని కొనసాగిస్తారు" అని బిగ్ బాస్ చెప్పాడు.
అయితే ఈ టాస్క్ లో అదిరిపోయే ట్విస్ట్ లు ఉన్నాయి. బిగ్ బాస్ ప్రతీ రౌండ్ కి ఒక అమౌంట్ ను ఫిక్స్ చేసాడు. ఈ అమౌంట్ అనేది విన్నర్ ప్రైజ్ మనీ నుండి కోత విధించబడుతుంది. ఆ తర్వాత గేమ్ లో ఓడినవాళ్ళు ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. రాజ్ ని ఇనయా సెలెక్ట్ చేసి తనని కెప్టెన్ పోటీ నుండి తొలగించగా, ఫైమా కూడా అదే తరహాలో తొలగిపోయింది. ఇక రేపు జరుగబోయే చివరిదైన కెప్టెన్సీ పోటీలో పాల్గొనడానికి రంగం సిద్ధమైంది. కాగా ఈ 'బిబి ట్రాన్స్ పోర్ట్' టాస్క్ లో విజేతలుగా నిలిచింది అయిదుగురు మాత్రమే. 'శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా' కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధించారు. అయితే ఈ పోటీలో గెలిచేదెవరో? కెప్టెన్ అయ్యేదెవరో? చూడాలి మరి!