English | Telugu
జడ్జెస్ లో ఆల్ రౌండర్ ఇంద్రజగారే.. రాంప్రసాద్ కామెంట్స్ వైరల్!
Updated : Dec 16, 2022
ఇంద్రజ ఎప్పటికప్పుడు కొత్త పోకడలకు తగ్గట్టుగానే తనను తాను డిజైన్ చేసుకుంటూ మెరుగవుతూ వస్తోంది. ఏ షో చేసినా అందులో తనదైన ఒక మార్క్ ని చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు.
ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ 100 వ ఎపిసోడ్ లో బ్లాక్ కలర్ సారీలో అద్భుతంగా మెరిసింది ఇంద్రజ. "ఏదో ఒక రాగం" అని పాట పాడి అందరిని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. అలాగే "ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళా" అనే సాంగ్ కూడా అద్భుతంగా పాడి స్టేజి మీద ఉన్న అందరి చేతా "సూపర్ సూపర్ సూపర్" అని అనిపించుకున్నారు. ఇక ఆటో రాంప్రసాద్ లేచి "జడ్జెస్ లో ఆల్ రౌండర్ మీరే మేడం" అన్నాడు..ఆది ఐతే "ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో మీ వాయిస్ లో అంత డెప్త్ ఉంది" అని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు.
ఇంద్రజ ఇప్పుడున్న అందరి జడ్జెస్ లోకి చాలా స్పెషల్..ఎందుకంటే ఈమె యాక్టర్, సింగర్, డాన్సర్ అన్ని రంగాల్లో ఆరితేరిన మనిషి. ఇక నెటిజన్స్ కూడా ఆమె పాడిన పాటలకు ఫిదా అవుతూ కామెంట్స్ చేశారు.. అలాగే ఒకే ఫ్రేమ్ లో రష్మిని, సౌమ్యను చూడడం కూడా బాగుంది అంటున్నారు.