English | Telugu

జబర్దస్త్ లో కొత్త టీమ్స్..ఇక కామెడీ పీక్స్ అంటున్న నెటిజన్స్!


జబర్దస్త్ లో ప్రతీ వారం కొత్త కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పు వచ్చే వారం నుంచి కనిపించబోతోంది. 22 న ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కొత్త యాంకర్ వచ్చింది. కొత్తకొత్త జడ్జెస్ కూడా వస్తూ ఉన్నారు.

ఇక ఇప్పుడు కొత్త టీమ్స్ కూడా వస్తున్నాయి. నాన్స్టాప్ నూకరాజు టీమ్, ఖిలాడీ ఖాజా టీమ్, రాకెట్ రాఘవ టీమ్, వెంకీ మంకీస్ టీమ్, రైసింగ్ రాజు టీమ్ కనిపించి అలరిస్తోంది. ఇక వచ్చే వారం నుంచి సూపర్ సద్దాం-యాదమ్మ రాజు టీమ్, షైనింగ్ శాంతకుమార్ టీమ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సద్దాం-యాదమ్మ రాజు ఆల్రెడీ ప్రూవెన్ కమెడియన్స్. వీళ్ళు జబర్దస్త్ స్టేజి మీదకు రావడం ఇదే మొదటి సారి. వీళ్ళు ఇప్పటికే ఆహాలో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో స్టాక్స్ గా అందరినీ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు వచ్చే వారం నుంచి జబర్దస్త్ స్టేజి మీద కూడా కనిపించబోతున్నారు.

ఇక షైనింగ్ శాంతకుమార్ గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసాడు తర్వాత షో నుంచి కొంత బ్రేక్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ "సద్దాం, రాజు.... వెల్కమ్ బ్యాక్ అలాగే చంద్రన్న కూడ రావాలి... వెల్కమ్ బ్యాక్ జబర్దస్త్ శాంతి కుమార్ " అని కామెంట్స్ చేస్తున్నారు.