English | Telugu

సస్పెన్స్ గా మారిన మిడ్ వీక్ ఎలిమినేషన్.. శ్రీసత్య అవుటా? కాదా?


బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. కాగా బుధవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉంటాయని బిగ్ బాస్ చెప్పగా, గురువారం కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్ లో ఉండటమనేది పలు అనుమానాలకు దారి తీస్తుంది.

అయితే గత వారం శ్రీసత్య ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిబి మేనేజ్మెంట్ కోటా అని శ్రీసత్యని పంపించకుండా, ఇనయాని పంపించిన బిగ్ బాస్ ని ఇప్పటికే జనాలు ఫేక్ పీపుల్, అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ టీం సందిగ్ధంలో పడిందా.. లేదంటే మరోక ట్విస్ట్ ఉండబోతుందా అన్నట్టుగా మారింది. బిగ్ బాస్ చరిత్రలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఇదే తొలిసారి. అయితే ఇది ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇప్పటివరకు జరిగిన అఫీషియల్ ఓటింగ్ లో శ్రీసత్య లీస్ట్ లో ఉంది. అయితే సోషల్ మీడియాలో అనఫీషియల్ గా శ్రీసత్య ఎలిమినేట్ అంటూ వార్త చక్కర్లు కొడుతోంది. కానీ బిగ్ బాస్ గురువారం జరిగిన ఎపిసోడ్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్ చూపించకపోవడం.. ఓటింగ్ లైన్స్ లో శ్రీసత్య పేరు ఉండటం వల్ల మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా? లేదా అనేది ప్రేక్షకులకు ఇంకా సస్పెన్స్ గా ఉంది. అయితే ఇప్పటికే హౌస్ లో ఉన్నవాళ్ళవి.. అందరి జర్నీ వీడియోలు చూపించడంతో, ఎవరు బయటకొస్తారనేది గందరగోళంగా మారింది.