English | Telugu

కొత్త కుట్ర‌కు తెర‌లేపిన అభిమ‌న్యు, మాళ‌విక‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఓ పాప చుట్టూ ప్ర‌ధానంగా ఈ సీరియ‌ల్ సాగుతోంది. పాప ఖుషీని న‌త‌కు కాకుండా చేయ‌డంతో అభిమ‌న్యుని ఎలాగైనా మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌ని ప్లాన్ వేసిన అభిమ‌న్యు త‌ను నా కూతురేన‌ని, త‌న‌కు , మాళవిక‌కు పుట్టిన పాప అని కొత్త నాట‌కం మొద‌లుపెడ‌తాడు. దీంతో య‌ష్ లో అనుమానాలు మొద‌ల‌వుతాయి.

ఈ విష‌యం తెలిసిన వేద డీఎన్ ఏ టెస్ట్ చేయించుకుంటే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని, దీంతో అభిమ‌న్యుకి బుద్దిచెప్పొచ్చ‌ని చెబుతుంది. క‌ట్ చేస్తే య‌ష్‌, వేద ఫ్యామిలీస్ సీతారాముల క‌ల్యాణం కోసం గుడికి వెళ‌తారు. అక్క‌డ వైభ‌వంగా సీతారాముల క‌ల్యాణం జ‌రిపిస్తారు. అక్క‌డికి ఎవ‌రికీ తెలియ‌కుండా ఎంట్రీ ఇచ్చిన మాళ‌విక .. ఖుషీని అడ్డంపెట్టుకుని అభిమ‌న్యు ఇచ్చిన లెట‌ర్ ని య‌ష్ కు చేర‌వేస్తుంది. అది చ‌దివిన య‌ష్ .. ఖుషీని దూరం పెడ‌తాడు.

అది త‌ట్టుకోలేని ఖుషీ ఎలాగైనా త‌న తండ్రి మ‌న‌సు మార్చ‌మంటూ అక్క‌డే వున్న హ‌నుమాన్ విగ్ర‌హం చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తుంది. ఇది గ‌మ‌నించిన వేద డీఎన్ ఏ రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని, ఖుషీ తండ్రి మీరే అని చెబుతుంది. ఆ మాట‌లు విన్న య‌ష్ ఆనందంగా ఖుషీ ద‌గ్గ‌రికి వెళ్లి త‌నని ఎత్తుకుని ముద్దాడ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? ... ఇంత‌కీ వేద నిజంగానే డీఎన్ ఏ రిపోర్ట్ ని తెప్పించిందా? .. అభిమ‌న్యు, మాళ‌విక‌ల రియాక్ష‌న్ ఏంటీ? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.