English | Telugu

100 రూపాయలతో మొదటి ఆల్బం... ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం...

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో రచ్చ రవి కూడా ఒక వ్యక్తి. జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ తో పేరు తెచ్చుకుని తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిజీ అయ్యాడు. తెలంగాణ హన్ముకొండ నుంచి ఇండస్ట్రీలో ఒక్కోమెట్టు ఎక్కుతూ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ‘బలగం’ మూవీలో ఆటో డ్రైవర్‌గా హీరోకి స్నేహితుడిగా నటించాడు. అలాగే గద్దలకొండ గణేష్, ఎంసీఏ, ఒక్కక్షణం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్ వంటి మూవీస్ లో కూడా నటించాడు రచ్చ రవి. అలాంటి రవి రీసెంట్ గా తన స్టార్టింగ్ డేస్ ని ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ వాటిని తన ఫాన్స్ తో షేర్ చేసుకోవడం కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.

"సినిమా అవకాశాల కోసం వెళ్లినప్పుడు నా మిత్రులు వంశీకృష్ణారెడ్డి... మర్ఫీ.... నువ్వు ఏం చేయగలవో ఆడిషన్ లో చేసి చూపించాలి... దాంతోపాటు నీ హావాభావాలు , ముఖకవళికలు తెలిసేటట్టు ఒక ఆల్బమ్ కావాలని చెప్పినప్పుడు..నా రంగుల ప్రపంచం కోసం వంశీకృష్ణారెడ్డి సహకారంతో ఆల్బమ్ కోసం వంద రూపాయలు రెడీ చేసుకుని ఒక ఫోటోగ్రాఫర్ ని దొరకబుచ్చుని 100 రూపాయలు ఇచ్చి తీసుకున్న నా మొదటి ఆల్బమ్ ఇది ...అలనాటి నా జ్ఞాపకం మీతో పంచుకోవాలని ఇలా.. శుభ సాయంత్రం మిత్రులారా" అంటూ ఒక హార్ట్ టచింగ్ కామెంట్ పెట్టాడు.

జబర్దస్త్‌ ఆర్టిస్టుగా, స్టాండప్‌ కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్కిట్ రైటర్‌గా రవి లైఫ్ జర్నీ కొత్త కమెడియన్స్ కి ఎంతో ఇన్స్పిరేషన్ కూడా. జబర్దస్త్ స్కిట్స్ లో ‘శాంతాభాయ్‌’గా అలరించినా, ‘తీసుకోలేదా రెండు లచ్చల కట్నం’ అంటూ దెప్పిపొడిచినా ఆయనకే సొంతం. ఇక రచ్చ రవి పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే "ఎనర్జీలో, స్మైల్ లో తేడా ఏమీ లేదు..అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్... " అంటున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.