English | Telugu

Illu illalu pillalu: మామకు ఎదురుతిరిగిన కోడలు.. ప్రేమకు అత్త సపోర్ట్ చేయనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu Pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-165లో.. ట్యూషన్ విషయంలో ప్రేమ, వేదవతిలు ఎన్ని విధాలుగా సర్దిచెప్పడానికి చూసినా రామరాజు వినిపించుకోడు. దాంతో ప్రేమ రివర్స్ అవుతుంది. మీకు చెప్పాలనే అనుకున్నాం.. ఇంతలో పిల్లలు వచ్చేయడంతో చెప్పడం కుదర్లేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అనగానే.. ఇది నీకు చిన్న విషయమే కావచ్చు కానీ.. ఇది నా ఇంటికి, గౌరవానికి మచ్చ తెచ్చే విషయమని రామరాజు అంటాడు. నేను ట్యూషన్ చెప్తే మీ పరువు పోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అడుగుతుంది.

ఆరోజు కాఫీ షాప్‌లో పనిచేస్తే మీ వాళ్లు వచ్చి ఎంత పెద్ద గొడవ చేశారో చూశాం కదా.. నీకు రూమ్ ఇవ్వలేదని ఎంత పెద్ద పెంట చేశారో చూశాం కదా.. ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్తుంటే.. మాకు గతిలేక నీతో ట్యూషన్ చెప్పిస్తున్నామని మాపై పడి ఏడుస్తారు. కాబట్టి నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీళ్లేదు.. ట్యూషన్ చెప్పాలనే ఆలోచన కూడా నీకు రాకూడదని రామరాజు అంటాడు. లేదు మామయ్యా.. నేను ఖచ్చితంగా ట్యూషన్ చెప్పే తీరుతానని ప్రేమ అంటుంది. ఏమన్నావని రామరాజు అంటే.. అవును మామయ్యా.. మా నాన్న వాళ్లు ఏమనుకుంటారో.. మీరేం అనుకుంటారో... నాకు అనవసరం. కానీ ట్యూషన్ చెప్పడం నాకు అవసరమని ప్రేమ అంటుంది. నేను వీళ్లేదు అంటే.. ట్యూషన్ చెప్తాననే అంటున్నావ్.. అంటే నా మాటకి నా నిర్ణయానికి ఎదురుచెప్తావా అని రామరాజు అరుస్తాడు. ఇది ఎదురుచెప్పడం కాదు మామయ్యా.. అలా చెప్పను కూడా.. కానీ నెలనెలా ఇంట్లో మా ఆయన పదివేలు ఇవ్వాలి.. ఆయన చేసే పార్ట్ టైమ్ ఉద్యోగానికి అంత డబ్బు రాదు. మరేం చేయాలి అందుకే మా ఆయనకి నాకు.. నావంతు సాయంగా నిలబడటం కోసం ఈ ట్యూషన్ చెప్తున్నాను.. దయచేసి అర్థం చేసుకోండి మామయ్యా అని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. కుదరదని చెప్తున్నాను కదా.. మొండిగా మాట్లాడతావ్ ఏంటని రామరాజు అంటాడు. నేను మొండిగా మాట్లాడటం లేదు మామయ్యా.. మా పరిస్థితిని అర్థం చేసుకోమని బ్రతిమిలాడుతున్నానని ప్రేమ అంటుంది. చూడూ.. నేను మీ వాళ్లతో మాటలు పడదల్చుకోలేదు. నిన్ను కష్టపెడతున్నాననే అవమానాన్ని మోయదల్చుకోలేదు. నా గౌరవాన్ని ఇంటి పరువుని వీధిలో పడేయదల్చుకోలేదు. అందుకే ట్యూషన్ చెప్పాలనే ఆలోచనను నీ మనసులో నుంచి తీసేయమని రామరాజు అంటాడు.

చూడండి మామయ్యా.. మేం నెలనెలా పదివేలు ఇవ్వాలి.. మా పరిస్థితిని అర్థం చేసుకోండి అని ప్రేమ ఎంత రిక్వెస్ట్ చేసినా రామరాజు వినిపించుకోడు. చెప్తే అర్ధం కాదా నీకు.. ఇది నా ఇల్లు.. నేను చెమటోర్చి సంపాదించుకున్న ఇల్లు.. ఇన్నేళ్లుగా నేను తీర్చుదిద్దుకున్న కుటుంబం ఇది. నా కుటుంబంలో ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటాను. నా ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీళ్లేదు. నా నిర్ణయాన్ని కాదంటే.. మీరు కష్టపడి ఇల్లు కట్టుకోండి. ఆ ఇంట్లో మీకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్ప నా ఇంట్లో మీ సొంత నిర్ణయాలను అంగీకరించనని రామరాజు అంటాడు. ఇక ప్రేమ ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది.‌ తన వెనకాలే వేదవతి వెళ్ళి.. మామయ్య గారు చెప్పింది కూడా కరెక్టే కదా.. ఆ రోజు మీ వాళ్ళు అలా అన్నారు కదా.. నువ్వు ట్యూషన్ చెప్తే గొడవ చెయ్యరా అని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.