English | Telugu
Illu illalu pillalu : శ్రీనివాసరావు నిజం చెప్తాడా.. భాగ్యంకి మొదలైన డౌట్!
Updated : Feb 12, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -392 లో.. రామరాజు కుటుంబం గుడికి వెళ్తారు. అదే గుడికి శ్రీనివాసరావు వస్తాడు. సాగర్ కి జాబ్ వచ్చిందని తన పేరున అర్చన చేయించడానికి శ్రీనివాసరావు వస్తాడు. అదే గుడికి అమూల్య, విశ్వ కూడా వస్తారు. ప్రేమ, ధీరజ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జామ్ అంటే బాగుండదని ప్రేమ అంటుంది. అదేం లేదు నోటిఫికేషన్ పడినప్పుడే ఎగ్జామ్ రాయాలని ధీరజ్ అంటాడు.
అమూల్య వాళ్ళని ధీరజ్ చూసి ఇప్పుడు వాళ్ళని నాన్న చూస్తే డిస్టబ్ అవుతాడు. వెంటనే ఇక్కడ నుండి తీసుకొని వెళ్లాలని ప్రేమతో ధీరజ్ అంటాడు. నాన్న ఇంటికి వెళదామని రామరాజు వాళ్ళని ధీరజ్ తీసుకొని వెళ్తుంటే పొర్లు దండాలు పెడుతూ శ్రీవల్లి కన్పిస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని రామరాజు అడుగుతాడు. మీరు బాగుంటే ఇలా చేస్తానని మొక్కుకుందని భాగ్యం అంటుంది. అప్పుడే శ్రీనివాసరావు స్వీట్ పంచుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నాన్న స్వీట్ ఏంటి అని నర్మద అడుగుతుంది. అదే సాగర్ కి అని చెప్పబోతు నర్మద సైగ చెయ్యగానే అతను ఆగిపోతాడు. అదే సాగర్ నువ్వు అన్యోనంగా ఉంటున్నారు కదా అందుకే అని శ్రీనివాసరావు అంటాడు. అది కాదేమోనని భాగ్యం అంటుంది. తన వంక నర్మద కోపంగా చూస్తుంది.
అప్పుడే రామరాజుని అమూల్య చూసి.. నాన్న అంటూ దగ్గరికి వస్తుంది. మనకి వాళ్లతో ఏంటని రామరాజు వాళ్ళని తీసుకొని వెళ్తుంది వేదవతి. మరొకవైపు ఆ విశ్వగాడు మాట్లాడుతానని చెప్పి పెళ్లి చేసుకొని నాకు ఇంత టెన్షన్ పెట్టాడని శ్రీవల్లి కోపంగా విశ్వ దగ్గరికి వెళ్తుంది. నేను పెళ్లి చేసుకోలేదు.. అదే తాళి మెడలో వేసుకుంది దాని వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నారని విశ్వ అనగానే శ్రీవల్లి, భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు. ఇంటికి వచ్చాక అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారని భాగ్యం, శ్రీవల్లి ఆలోచిస్తారు. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.