English | Telugu
ఈ పిల్ల దొరకడం నా అదృష్టం..హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ప్రపోజ్
Updated : Feb 12, 2026
ఆట షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో వాలెంటైన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. ఇక జడ్జ్ జాన్ మాష్టర్ వైఫ్ ఆయేషా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. రాగానే "ఆయన మా జడ్జ్ అండి. ఈ షోకి పెద్దిఅంటాం ఆయన్ని. జానీ మాస్టరండి" అంటూ సుధీర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాడు. " మాస్టర్ హ్యాపీ వాలెంటైన్స్ డే" అంటూ ఆయేషా జానీ మాష్టర్ కి ప్రొపోజ్ చేసింది. దాంతో ఆయన స్టేజి మీదకు వచ్చి వైఫ్ ని హగ్ చేసుకున్నారు. "ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్" అని సుధీర్ అడిగాడు. "మాష్టర్ చేశారు ఫస్ట్ " అందిం ఆయేషా. "ఎలా ప్రపోజ్ చేశారు" అనేసరికి. " హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే ఏ సుమా ఐ లవ్ యూ నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అన్నారు. " మీరెప్పుడు ఓకే చెప్పారు" అని సుధీర్ అడిగాడు.
"ఆయన హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు" అంటూ నిహారిక ఆన్సర్ ఇచ్చింది. "మాష్టర్ మీరు చాలా ఫాస్ట్. నేను చాలా స్లో మీకు నాకు సెట్ అవ్వదు అని అంటే అలా ఉంటేనే స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నారు. మరి ఇంత స్ట్రాంగ్ అవుతదని నాకు తెలీదు. ఐ లవ్ యు " అని చెప్పింది ఆయేషా. "వావ్ ఐ లవ్ యూ టూ. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో గాని. నాకు ఈ పిల్ల దొరికింది. మీ అమ్మా నాన్నకి నేను చాలా థాంక్స్ చెప్తున్నాను. నిన్ను కనీ నాకివ్వటం" అంటూ వైఫ్ అయేషా కోసం తెచ్చిన కాలి పట్టీలను ఆమె కళ్ళకు అలంకరించాడు జానీ మాష్టర్. ఇక నెటిజన్స్ ఐతే "జానీ మాష్టర్ ఫామిలీ బాగుండాలి. జానీ మాస్టర్ ఎక్సలెంట్. జీరో నుంచి పైకొచ్చాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.