English | Telugu

ముకేష్ గర్ల్స్ అందరికీ క్రష్.. కానీ ఈయనకి ఎవరు క్రష్?


వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. బుల్లితెర మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ కాన్సెప్ట్ తోనే రాబోతోంది. "వాలెంటైన్స్ డే కి మా పరివారానికి వచ్చేస్తున్నారు. వన్ సైడ్ లవర్స్ వాళ్ళ క్రషెస్ తో వచ్చేస్తున్నారు" అంటూ చెప్పింది శ్రీముఖి. "వన్ సైడ్ లవ్ లో ఉన్న వన్ బెస్ట్ క్వాలిటి అంటే ఏం చెప్తావ్" అంటూ శ్రీముఖి విష్ణు ప్రియను అడిగింది. "చెప్పలేన్రా" అంటూ విష్ణు ఆన్సర్ ఇచ్చింది. "చెప్పలేకపోతుందంటే దానిది వన్ సైడ్ కాదు టూ సైడ్స్" అంటూ రోహిణి పెద్ద జోక్ పేల్చింది. "లైఫ్ టైం మొత్తం వన్ సైడ్ లవర్ గా లేకపోతే ఒక రిలేషన్‌షిప్ లో ఉండాలి అంటే నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావ్" అంటూ శ్రీముఖి ప్రిన్సిని అడిగింది.

'వన్ సైడ్ లవ్' అంటి చెప్పింది ప్రిన్సి. "ఈమె వన్ సైడ్ అవతలోడు సూసైడ్" అంటూ ఇమ్మానుయేల్ ప్రిన్సి మీద కౌంటర్ వేసాడు. "వన్ సైడ్ కాదు జస్ట్ ఫ్రెండ్స్ " అంటూ రీతూ ఆన్సర్ ఇచ్చింది. కాలిఫ్లవర్ లు ఎక్కడైనా పెట్టండి అంటూ విష్ణు అనేసరికి అంతకు ముందు నువ్వూ పెట్టావ్ చాల అంటూ అవినాష్ కౌంటర్ ఇచ్చాడు. "డీమన్ డాన్స్ చూశారా రీతు పక్కన లేకపోతే చాలా బాగా చేస్తున్నాడు" అంటూ హరి చెప్పాడు. "ఏయ్. ఇదేదో బిబి జాడీలో చెయ్యొచ్చుగా" అని రోహిణి అనేసరికి "పక్కన రీతో ఉందిగా" అన్నాడు హరి.


ఇంతలో అక్కడికి వచ్చిన బాలుతో డాన్స్ చేసింది శ్రీముఖి. "బాలు కొంచెం పక్కకి తీసుకెళ్లి మాట్లాడు" అంటూ సలహా ఇచ్చింది రీతూ. "శ్రీముఖి గారు నేనా పోడియంకెళ్ళొచ్చా వీళ్ళిద్దరూ వాయిస్ మధ్యలో ఐపోయాను" అంటూ విష్ణు, రీతూ మీద కంప్లైంట్ చేసాడు. "నా ముందే నువ్వు వేరే వాళ్ల క్రష్ గా ఇక్కడికి రావడం నీకు బాధగా అనిపించట్లేదా బాలు" అంటూ శ్రీముఖి గోముగా అడిగింది. "లేదు నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది వీళ్ళందరూ ఉన్నారని" అంటూ ఏమీ తెలియని అమాయకుడిలా చెప్పాడు. ఇక అక్కడికి గుప్పెడంత మనసు రిషి వచ్చాడు. "ముకేష్ గర్ల్స్ అందరికీ క్రష్ కానీ ఈయనకి ఎవరు క్రష్ అని అనుకుంటున్నారు" అంటూ అక్కడున్న గర్ల్స్ అందరినీ అడిగింది శ్రీముఖి. రోహిణి వాళ్లంతా ఆన్సర్ ఇచ్చారు. తర్వాత పృద్వి శెట్టిని చూపిస్తూ "ఈ వ్యక్తి ఎవరి క్రష్" అని అడిగింది. ఏ విష్ణు అంటూ అవినాష్ బాలుని చూపించేసరికి మగాళ్లు మగాళ్లు క్రష్ ఏంటబ్బా అని ఇమ్ము అడిగాడు. ఈ విష్ణు కాదురా ఆ విష్ణు అంటూ శ్రీముఖి విష్ణుప్రియను చూపించింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.