English | Telugu
శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు
Updated : Feb 12, 2026
ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు. వెంటనే "సార్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి" అని చెప్పేసరికి శేఖర్ మాష్టర్ నవ్వేసాడు. తర్వాత సదా డ్రెస్ ని చూసి పొగిడేసాడు ఎందుకు బ్లష్ అవుతున్నారు అని అడిగాడు. ఫినాలే లోపు జోడీతో వస్తా అని చెప్పింది. తర్వాత సీత, సాయి శ్రీనివాస్ కలిసి జోడిగా స్టేజి మీదకు వచ్చారు. "వెల్కమ్ సీత గారు. వండర్ఫుల్. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు" అని అడిగాడు ప్రదీప్. "వాట్సాప్ లో కనెక్ట్ అయ్యాము" అని చెప్పింది. "అమ్మ మీరు మాములుగా మాట్లాడుకునే కనెక్షన్ కాదమ్మా" అనేశాడు. తర్వాత నైనికా - అమరదీప్ డాన్స్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. సీత 10 ఇచ్చింది. వెంటనే శేఖర్ మాష్టర్ రియాక్ట్ అయ్యారు. "ఒక్కటే చెప్తున్న స్ట్రాటజీ ప్లే చేయొద్దు. ప్రతి జోడీకి చెప్తున్నాం. ఓన్లీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకునే ఇవ్వండి. బెస్ట్ ఫ్రెండ్ అది ఇది అన్నీ బయట." అని చెప్పారు.
తర్వాత డీమన్ పవన్ - రీతూ కలిసి ఒక పెర్ఫార్మెన్స్ చేశారు. ఐతే సదా మాత్రం స్టోరీ టెల్లింగ్ బాగుంది అన్నీ డైలాగ్స్ ఐపోయాయి. ప్రాబ్లమ్ అంతా కోరియోగ్రఫీతోనే అని చెప్పింది.
నాకు ఇలాంటి కామెంట్స్ వస్తాయని నాకు తెలుసు అని రీతూ అనేసరికి ముందే తెలిసినప్పుడు ఎందుకు అని సదా అడిగింది. మాష్టర్ దే తప్పు అన్నట్టు రీతూ చెప్పింది. ఇంతలో ప్రదీప్ కొరియోగ్రాఫర్ ని విజయ్ ని స్టేజి మీదకు పిలిచాడు. " కాన్సెప్ట్ ఇలా ఉంది ఒక్కళ్ళ పెర్ఫామెన్స్ ఎక్కువ ఇంకోళ్ళుది తక్కువ ఉంది అని మార్చమని మిమ్మల్ని అడిగారు అంటున్నారు" అని అడిగాడు ప్రదీప్ . "కాకపోతే వాళ్ళకు ఉన్న తక్కువ టైమ్ లో నేను ఎందుకు మెస్ చేయాలి చేసేదేదో పర్ఫెక్ట్ గా చేస్తే చాలు అని చెప్పి అంతే చేయించాను. వాళ్ళకి టైమ్ కూడా కుదరలేదు" అని చెప్పాడు. "ముందే కాన్సెప్ట్ నచ్చలేదు. ఐ డొంట్ ఫీల్ ఎనీ ఎమోషన్ ఇన్ దిస్" అంది రీతూ. "సరే వాళ్ళు టైమ్ ఇచ్చి ఉంటే ఇంకొన్ని ఎక్కువ రోజులు ప్రాక్టీస్ కి వచ్చి ఉంటే మీరు ఇంకో బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ కాన్సెప్ట్ ఇంకా అద్భుతంగా వచ్చేది" అంటూ ప్రదీప్ అన్నాడు.
అవును అంటూ కొరియోగ్రాఫర్ చెప్పాడు. తర్వాత స్టేజి మీదకు "ఫంకీ" మూవీ టీమ్ వచ్చింది. "అనుదీప్ గారు బయట పరిస్థితి ఏమిటి" అంటూ ప్రదీప్ అడిగేసరికి "నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అంటున్నారు అంతా" అని చెప్పాడు. " వాలెంటైన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు" అని మళ్ళీ అడిగాడు. "సింగిల్ గానే " అని చెప్పాడు. హీరోయిన్ మాత్రం "అతని చాల ప్లాన్స్ ఉన్నాయని అని చెప్పింది. "లేదండి ప్లాన్స్ ఏమీ లేవు. ఇక్కడనే ఉంటా" అని చెప్పాడు. " వాళ్ళే ఇక్కడికి వస్తున్నారా " అని మళ్ళీ అడిగాడు "ఫస్ట్ టైం ఎలా ప్రపోజ్ చేశారు ఏం చెప్పారు" అని మళ్ళీ అడిగాడు ప్రదీప్. " అతను ఆల్రెడీ లండన్ లో ఉన్నాడు" అని సదా చెప్పేసరికి అనుదీప్ నో నో అంటూ తడబడ్డాడు.