English | Telugu

ఎక్స్‌ప్రెష‌న్స్ క్వీన్ పూర్ణ ఫుల్ చిల్ అవుతోంది!

పూర్ణ హ్యాపీగా పెళ్లి చేసుకుని తల్లి కాబోతోంది..రీసెంట్ గా ఈమె సీమంతం వేడుకలు కూడా జరిగాయి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలో పూర్ణ కూడా అంతే హ్యాపీగా ఆడిపాడుతోంది. ఆ డాన్స్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేసింది. లేడీ కొరియోగ్రాఫర్ సునీత రావుతో కలిసి ఫుల్ ఛిల్ల్ అవుతోంది. "టంటం" అనే సాంగ్ కి ఇద్దరూ సేమ్ స్టెప్స్ తో సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో చేశారు. సునీతరావు కూడా ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది

"ఓహ్ మై గాడ్ మేము కలిసి డ్యాన్స్ చేసి చాలా కాలం అయ్యింది..ఒక కొరియోగ్రాఫర్‌గా చాలా సంతోషకరమైన విషయం ఒకటి నీతో షేర్ చేసుకోవాలి..అదేంటంటే నా కొరియోని పర్ఫెక్ట్ గా చేస్తావు అందంగా మార్చేస్తావు. నీలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎవరికీ రావు. నువ్వే నా ఎక్స్ప్రెషన్స్ క్వీన్...మై బెస్టీ. నిన్ను చూసి చాలా రోజులయ్యింది .అమ్మవు అయ్యాక చూడడం చాలా సంతోషంగా ఉంది.నీకు నీ జూనియర్ కి నా ముద్దులు, హగ్గులు" అని కామెంట్ పెట్టింది.

ఇక పూర్ణ ఆది తీస్‌మార్‌ ఖాన్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నాని "దసరా" మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈమె ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో జడ్జిగా చేసి బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.