English | Telugu

రాజ్ కి స్వప్న మరింత దగ్గర అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‌'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్- 12 లోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో.. స్వప్న అందంగా ముస్తాబై రాజ్ ని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని వస్తుంది. తను ఇంటి నుండి‌వచ్చేప్పుడు మొబైల్ మర్చిపోయి వస్తుంది. కావ్య, అప్పు ఇద్దరు కలిసి‌ స్వప్న ఫోన్ ఇవ్వడానికి రాజ్ ఇంటి గేట్ వరకు వస్తారు. వాచ్ మెన్ వీరిద్దరిని‌ రానివ్వకుండా ఆపేస్తారు. మేము చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చామని కావ్య చెప్పగా.. అప్పు తన రౌడీయిజాన్ని చూపిస్తుంది.

స్వప్న మనసు గెలుచుకోడానికి రాజ్ తన కుటుంబ సభ్యులని పరిచయం చేస్తాడు. రాజ్ వాళ్ళ‌ అత్తయ్య రుద్రాణికి
అసలు నిజం తెలిసి, స్వప్నని‌‌ ఇండైరెక్ట్ గా అనుమానిస్తుంటుంది.‌ రుద్రాణి మాట్లాడిన ప్రతీసారీ, తనకి నిజం తెలిసిందేమోనని స్వప్న డౌట్ పడుతుంది. మరోవైపు రాజ్ తన కుంటుంబాన్ని పరిచయం చేస్తాడు. తను బాగా రిచ్ అని నిరూపించుకోవడానికి యాక్ట్ చేస్తుంటుంది స్వప్న.

రాజ్ కి వాచ్ మెన్ కాల్ చేసి బయట ఒక అమ్మాయి వచ్చి అల్లరి చేస్తుందని చెప్తాడు. దీంతో రాజ్ గేట్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ కావ్య ఉంటుంది. "నువ్వా మళ్ళీ వచ్చావా? మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావ్" అని రాజ్ అంటాడు. "చెప్పేది వినకుండా.. అసలు పట్టించుకోకుండా ఏది పడితే అది ఊహించుకోకండి. మేం ఒక పని మీద వచ్చాం" అని కావ్య చెప్తుంది. ఈ గొడవని ఇంట్లో నుండి స్వప్న చూస్తుంది. తొందర తొందరగా బయటకు వచ్చి రాజ్ ని లోపలికి తీసుకొస్తుంది స్వప్న. రాజ్ నేను వాళ్ళని పంపిస్తా అని చెప్పి కావ్య దగ్గరకి వచ్చి.. "వెళ్ళిపో.. ఇక్కడికెందుకు వచ్చావ్" అంటూ కోప్పడుతుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.