English | Telugu

శృతిమించి రాగాన పడుతున్న బీబీ జోడీస్ డాన్స్ షో

బీబీ జోడి ఈ వారం మరీ హద్దులు దాటి శృతిమించి రాగాన పడినట్టు కనిపిస్తోంది. ఒక్కో వారం ఒక్కో థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ షో.. డాన్స్‌లో కొత్త కొత్త ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తూ పర్ఫెక్ట్ స్టెప్స్ తో అలరిస్తున్నారు. కానీ కొన్ని డాన్స్ స్టెప్స్ మాత్రం ఏ సర్టిఫికెట్ కి సంబంధించినవే ఉంటున్నాయి..ఇక జడ్జెస్ కామెంట్స్ కూడా అడల్ట్ బేస్డ్ వే వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ ఐన లేటెస్ట్ ప్రోమో చూస్తే అది అర్ధమవుతుంది. ఈవారం బీబీ జోడిలో "కొరియోగ్రాఫర్స్ రౌండ్" ని అనౌన్స్ చేసింది శ్రీముఖి.

మెహబూబ్-శ్రీసత్య, అఖిల్-తేజస్వి జంటల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఎవ్వరికైనా సెగలు పెట్టాల్సిందే అన్నట్టుగా ఉంటున్నాయి. డ్రెస్సింగ్ స్టైల్ కానీ డాన్స్ స్టెప్స్ కానీ అంతకు మించి అన్నట్టుగా ఉంటున్నాయి. బాహుబలి’ సినిమాలోని మనోహరి పాటకు మెహబూబ్-శ్రీసత్య జోడి చేసిన డాన్స్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తే మాత్రం రియల్ జోడి ఏమో అన్నట్టుగా ఉంటుంది. ఇక వీళ్ళ డాన్స్ కి జడ్జి రాధ "నైట్ టైంలో లైట్స్ అన్నీ డిం చేసేసి అలా వింటుంటే చాలా బాగుంటుంది కదా శ్రీముఖి" అన్నారు. తర్వాత అఖిల్ - తేజు జోడి ‘లై’ సినిమాలోని ‘బొమ్మోలే ఉందిరా పోరి’ పాటకు డాన్స్ చేశారు. డాన్స్ లో భాగంగా తేజు వెనక్కి తిరిగి ఒక హిప్ మూవ్మెంట్ చేసింది. దానికి జడ్జి తరుణ్ మాస్టర్ పేపర్ చింపి మరీ బాగుందని చెప్పారు. వీళ్ళ డాన్స్ భంగిమలేమో గాని ఏదో బూతు డాన్స్ చూస్తున్న ఫీలింగ్ ఐతే రాక మానదు. కొంచెం పద్దతిగా, నీట్ గా చేసే జంట ఏదైనా ఉంది అంటే అది ఆర్జే కాజల్ జోడి.

ఇక వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కి నెటిజన్స్ మాత్రం ఫుల్ ఫిదా ఐపోతున్నారు. ఎవ్రీ వీక్ వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.