English | Telugu

Podarillu: రిసెప్షన్ కి నిరాకరించిన మహా.. చక్రి ఏం చేయనున్నాడు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -41 లో.... పోలీస్ స్టేషన్ లో చక్రి, మహాలకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడంతో అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అండి.. మనది నిజమైన పెళ్లి అనుకుంటున్నారా.. అలా ఎలా అనుకుంటున్నారని చక్రిపై కోప్పడుతుంది మహా. మనది అబద్ధపు పెళ్లి అని వాళ్ళకి తెలియదు కదా.. మనకి ఇచ్చారు తీసుకొని వెళదాం అంతే అని మహాకి నచ్చజెప్పుతాడు చక్రి. ఆ తర్వాత స్టేషన్ లోపలికి వెళ్లి కానిస్టేబుల్ కి థాంక్స్ చెప్పి సర్టిఫికెట్ తీసుకొని వస్తాడు చక్రి.

మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి రిసెప్షన్ కి అమ్మాయి వేసుకునే బ్లౌజ్ కుట్టించి తీసుకొని వచ్చానని ఇస్తుంది. నీకు ముందు పెళ్లి కావాలి.. వాడు చేసుకున్నాడు నీకేం బాధగా లేదా అని గాయత్రి అడుగుతుంది. అదేం లేదు వాడికైనా అయింది అని మాధవ అంటాడు. ఇంకెన్ని రోజులు బావ.. మా అమ్మ తెచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను.. ఆ విషయం తెలిసిన రోజు నన్నేమైనా చేస్తుందో తానేమైనా చేసుకుంటుందో తెలియదని గాయత్రి అంటుంటే అలా ఏం మాట్లాడకు.. ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని మాధవ అంటాడు. నువ్వు అయితే నైట్ ఫంక్షన్ కి వచ్చేయ్ అని గాయత్రికి చెప్తాడు.

మరొకవైపు చక్రి, మహా వస్తుంటారు. అసలు ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని మహా అనగానే నన్నే అంటున్నారా.. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకేం అవసరం అండి.. పెళ్లి కావాల్సిన అన్నయ్య ఉన్నాడు. అతన్ని వదిలేసి నేను చేసుకుంటే మా అన్నయ్యకి ప్రాబ్లమ్ ఉంది అనుకోరా.. అసలు మీకు నాకు ఏ సంబంధం లేదని అంటే మిమ్మల్ని మీ వాళ్లు తీసుకొని వెళ్లి పెళ్లి చేసేవారని చక్రి అనగానే అయ్యో సారీ అని మహా చెప్తుంది.

ఆ తర్వాత చక్రికి మాధవ ఫోన్ చేసి ఎక్కడ వరకు వచ్చారని అడుగుతారు. వస్తున్నామని చక్రి చెప్తాడు. కన్నా ఫోన్ తీసుకొని వదిన పూర్తి పేరు చెప్పమని అంటాడు. ఆ తర్వాత మహా, చక్రి ఇంటి దగ్గరగా వచ్చాక అక్కడ వాళ్ళ రిసెప్షన్ కి సంబంధించిన ఫ్లెక్సీ కన్పిస్తుంది. అది చూసి మహా, చక్రి షాక్ అవుతారు. నన్ను పర్మినెంట్ మిస్సెస్ చక్రి చేద్దామని అనుకుంటున్నారని షాక్ అవుతుంది.

తరువాయి భాగంలో అందరు రిసెప్షన్ కి వస్తారు. ఒక్క గంట సేపు స్టేజ్ పైన ఉండమని చెప్పు అని చక్రితో మాధవ చెప్తాడు. అదే విషయం మహాతో చక్రి చెప్తాడు. నా వల్ల కాదని మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.