English | Telugu

అందరి కంటే ముందుగా ఎలిమినేట్ అయిన షానీకి ఎంత ముట్టింది?

బిగ్ బాస్ ఆరవ సీజన్ లో అందరి కంటే ముందుగా ఎలినేట్ అయిన షాని గుర్తున్నాడా? షాని మహబూబ్‌నగర్ జిల్లా జెడ్చెర్ల గ్రామంలో జన్మించాడు. షాని ప్రొఫెషనల్ 'ఖోఖో' ఆటగాడిగా నేషనల్ లెవల్ అథ్లెటిక్స్‌కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సుమారుగా ముప్పైకి పైగా సినిమాల్లో నటించినా కూడా 'సై' మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. 'సై' సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు, 'రాజమౌళి' చూసి కాస్త డిఫెరెంట్ గా ఉన్నాడని సెలెక్ట్ చేశాడట. ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు లేకుండా పోయాయి. కాగా ఇప్పుడు చిన్న చిన్న చిత్రాలలో, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ రాణిస్తున్నాడు.

ఇప్పుడు 'బిగ్ బాస్' షో ద్వారా తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నాడు. హౌస్ లోకి పదమూడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇరవై మంది ఉన్న హౌస్ లో ఎవ్వరితోనూ కలవలేకపోయాడు. హౌస్ లో ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించలేకపోయాడు. మొదటి వారం నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు అత‌డిపై విమర్శలు కురిపించారు. మొదటి వారం నామినేషన్ లో ఉన్నా, ఎలిమినేషన్ లేకపోవడంతో సేవ్ అయ్యాడు. రెండవ వారం కూడా నామినేషన్ లో ఉన్నాడు. హౌస్ మేట్స్ అందరూ తనకి 'వేస్ట్ పర్ఫామెన్స్' ఇవ్వడం, అలాగే ఓటింగ్ లో చివరి స్థానంలో ఉండడంతో ఎలిమినేట్ అయ్యాడు. అదే రోజున హౌస్ నుండి బయటకు వచ్చేసాడు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాకా, ఆ వ్యక్తి హౌస్ లో ఉన్న అందరి గురించి ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుంది. షానీకి అలాంటిదిలేకపోయేసరికి, తన 'ఏవి'ని కూడా చూపించకపోయేసరికి హౌస్ సీక్రెట్ రూమ్ లో ఉంచారేమో అని ప్రేక్షకులు ఊహించుకున్నారు. కాకపోతే అలాంటిదేమి జరగలేదు. షానీ ఎలిమినేట్ అయ్యాక కనీసం నాగార్జునతో స్టేజ్ మీద కూడా కనిపించలేదు. తన మీద ఇంత చులకన భావం ఎందుకని బాధపడ్డాడట షాని. హౌస్ లోకి వచ్చిన వారందరికి ఎలిమినేట్ అయిన తర్వాత వారి జర్నీ వీడియో చూపించడం ఒక ఆనవాయితీ. అలాంటిది తనకు చూపించకపోవడం బాధాకరం అని వాపోయాడు. అయితే షానీని అత‌డి రెమ్యునరేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగారు. దానికి అత‌ను 'హౌస్ లో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు కలుపుకొని, వారానికి ముప్పై నుండి నలభై వేల చొప్పున ఇచ్చారు' అని చెప్పాడు.

"బిగ్ బాస్ లో నేను గడిపిన రోజులకు గుర్తుగా నాకంటూ ఒక్క 'ఏవీ' గానీ, 'జర్నీ వీడియో' గానీ లేదు. నాకంటూ కొన్ని జ్ఞాపకాలు‌ కూడా లేకుండా చేసారు" అని ఓ టీవి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు షాని.