English | Telugu

అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఎవరు కరెక్ట్?

బిగ్ బాస్ సీజన్-7 మొదలైన రెండవ వారంలోనే.. కామన్ మ్యాన్ , సెలబ్రిటీ ల మధ్య జరిగిన గొడవ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. మళ్ళీ పద్నాలుగు వారాల తర్వాత రిపీట్ అయింది. ఇప్పటికి హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.

బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా పద్నాలుగవ వారం కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఈ వారం ఓట్ అప్పీల్ కోసం హౌస్ లో‌ టాస్క్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా మొన్నటి టాస్క్ లో యావర్,‌ శోభాశెట్టి ఉండగా.. కన్నింగ్ అర్జున్ వేసిన ఒక్క నమ్మకద్రోహం పనివల్ల శోభాశెట్టి అధిక మద్దతు పొంది ఓట్ అప్పీల్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో అంబటి అర్జున్, అమర్ దీప్ గెలవడం వల్ల వారిద్దరు ఓట్ అప్పీల్ కి అర్హత సాధించగా.. హౌస్ మేట్స్ అభిప్రాయంతో అంబటి అర్జున్ ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు.

ఇక ఆ తర్వాత జరిగిన టాస్క్ కాస్త అమర్ దీప్, ప్రశాంత్ ల మధ్య పెద్ద గొడవకి దారితీసింది. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ ఒక జాకెట్ వేసుకోవాలి. మిగిలిన వాళ్ళు వారిపైకి బాల్స్ విసిరేస్తుంటారు. ఎవరి జాకెట్ కి ఎక్కువ బాల్స్ అతుక్కుంటావో వాళ్ళు అవుట్ అని బిగ్ బాస్ చెప్పాడు. మొదట యావర్ ని రెచ్చగొట్టి తనని లైన్ నుండి బయటకు వచ్చేలా చేసింది శోభాశెట్టి. ‌ఆ తర్వాత యావర్ మరింత రెచ్చిపోయాడు. అయితే ఇందులో శోభాశెట్టి కావాలని చేసిందని తనే ఒప్పుకుంది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్ టార్గెట్ చేసి బాల్స్ వేశాడు. ఇక దగ్గరికి వెళ్ళి ప్రశాంత్ ని పట్టుకొని ఫిజికల్ అయ్యాడు అమర్ దీప్. ఇందులో పల్లవి ప్రశాంత్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. అమర్ దీప్ కావాలని తనని గోళ్ళతో గీకాడని ప్రశాంత్ అనగా.. నన్ను రెచ్చగొట్టకు రా ప్రశాంత్ అని అమర్‌దీప్ అన్నాడు‌.‌ ఇక " నన్ను రా అని అనొద్దు" అన్న అని ప్రశాంత్ అనగా.. నన్ను నెగెటివ్ చేయాలని చూస్తున్నావ్? చేయు రా అంటు ఓవర్ అగ్రెసివ్ అయ్యాడు అమర్ దీప్. ఇక ఈ ఆర్గుమెంట్ లో పల్లవి ప్రశాంత్ ని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం చాలా పెద్ద తప్పు.. వీకెండ్ లో‌ నాగార్జున దీనిపై గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ ఉంది.‌ అయితే‌ ఇప్పుడు సోషల్ మీడియాలో అమర్ దీప్, ప్రశాంత్ లలో ఎవరు కరెక్ట్ అనే క్వశ్చన్ ట్రెండింగ్ లో ఉంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.