English | Telugu

ష‌ణ్ముఖ్ మ‌ళ్లీ మొద‌లు పెట్టాడోచ్‌

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ కు యూట్యూబ్ లో మంచి క్రేజ్ వున్న విష‌యం తెలిసిందే. ఆ క్రేజే అత‌న్ని బిగ్‌బాస్ సీజ‌న్ 5 లోకి ఎంట‌ర‌య్యేలా చేసింది. అయితే స్టార్టింగ్ నుంచి ష‌న్ను నే టైటిల్ ఫేవ‌రేట్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. చివ‌రి వ‌ర‌కు హౌస్ లో వున్నా విజేత‌గా నిల‌వాల్సిన ష‌న్ను చివ‌రికి సిరి కార‌ణంగా ర‌న్న‌ర‌ప్ గా నిల‌వాల్సి వ‌చ్చింది. చేజేతులా బిగ్‌బాస్ టైటిల్ ని జార‌విడుకున్నాడ‌ని, ఇందుకు సిరి చేసిన అతే కార‌ణ‌మ‌ని అంతా ఆమెపై దుమ్మెత్తిపోశారు. నెట్టింట ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.

Also Read: 'ఆచార్య‌'కి కాజ‌ల్ సెంటిమెంట్!

హౌస్ లో సిరి వ‌ల్ల ఎదురుదెబ్బ‌లు, అవ‌మానాలు ఎదుర్కొన్న ష‌న్ను బ‌య‌టికి వ‌చ్చాక త‌న ప్రియురాలు దీప్తి ఇచ్చిన బ్రేక‌ప్ షాక్ కు అత‌నికి దిమ్మ‌దిరిగిపోయింది. దీంతో కొన్ని రోజుల పాటు షాక్ లోకి వెళ్లిపోయాడు. ఏం జ‌రుగుతోందో తెలియ‌ని స్థితికి చేరిపోయాడు. తాజాగా ఇవ‌న్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డి మ‌ళ్లీ త‌న అడ్డాకు వ‌చ్చేస్తున్నాన‌ని మూడు రోజుల క్రిత‌మే ఇందుకు సంబంధించిన ముహూర్తాన్ని పెట్టేసుకున్నాడు ష‌న్ను.

త‌న కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశాడు. మ‌ళ్లీ యూట్యూబ్ లో కొత్త వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అదే `ఏజెంట్ ఆనంద్ సంతోష్‌`. దీనికి సంబంధించిన అప్ డేట్ ని అందించాడు. టైటిల్ ఇదే అంటూ ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశాడు. `యూట్యూబ్ లో నా నెక్స్ట్ వెబ్ సిరీస్ ...`ఏజెంట్ ఆనంద్ సంతోష్‌` సిరీస్ చూసినంత సేపు నా పేరు మీ మొహంలో ఉంట‌ది. బిగ్‌బాస్ త‌రువాత ఏ ఆఫ‌ర్ వ‌చ్చినా ముందు ఒక యూట్యూబ్ సిరీసే చేయాల‌ని ఉంది. మీరు నాకు ఇచ్చిన ప్రేమ‌కు గుర్తుగా చేయాల‌ని అనుకున్నాను. న‌వ్విస్తాం, టెన్ష‌న్స్ అన్ని మ‌రిచిపోయేలా న‌వ్విస్తాం` అని ష‌న్ను ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేశాడు. సాఫ్ట్ వేర్ డెవ‌లాప‌ర్, సూర్య వెబ్ సిరీస్ లు అందించిన సంస్థ `ఏజెంట్ ఆనంద్ సంతోష్‌` సిరీస్ ని నిర్మిస్తోంది.

" width="400" height="700" layout="responsive">

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...