English | Telugu
ఫహద్ ఫాజిల్ తన క్రష్ అంట!
Updated : Aug 15, 2023
ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది.
తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదగా గడిపింది. అయితే మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.
బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆట తీరుతో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది ఆరోహి. హౌస్ నుండి బయటకొచ్చాక ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా తను 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించింది. అందులో నీ సెలబ్రిటీ క్రష్ ఎవరని ఒకరు అడుగగా.. ఫహద్ ఫాజిల్ అని రిప్లై ఇచ్చింది ఆరోహి. 'కీర్తి భట్ పెళ్ళికి వెళ్తున్నారా? మిమ్మల్ని పిలిచిందా? డోంట్ స్కిప్' అని ఒకరు అడుగగా.. వెళ్తాను.. కీర్తి పిలిచిందని ఆరోహి చెప్పింది. 'వాట్ ఈజ్ యువర్ స్నాప్ ఐడీ' అని ఒకరు అడుగగా.. ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ వాడటానికే బద్ధకం అయితుందంటే ఇంక స్నాపా అని ఆరోహీ రిప్లై ఇచ్చింది. నీకు సూర్య అంటే లవ్ ఉందా? ఫ్రెండ్ షిప్ ఉందా? నీకు దమ్ముంటే నా క్వశ్చన్ కి రిప్లై ఇవ్వమని ఒకరు అడుగగా.. దీనికి దమ్ము, దగ్గు, ధైర్యం ఎందుకండి.. కీబోర్డ్ ఉంటే చాలు.. నేను సూర్య ఫ్రెండ్స్ మాత్రమే అని రిప్లై ఇచ్చింది ఆరోహి. 'మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తారా' అని ఒకరు అడుగగా.. "వద్దురా అయ్యా, టైమ్ వేస్ట్ పనులు చేసుకోను. ఎందుకంటే ఏం చేసిన అక్కడ ఉండేవాళ్ళే ఉంటరు, పోయేవాళ్ళే పోతరు" అని రిప్లై ఇచ్చింది ఆరోహి.