English | Telugu

Brahmamudi: అనామిక మాస్టర్ ప్లాన్.. ఆమె ట్రాప్ లో కావ్య పడుతుందా..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-521 లో.. అప్పు, కళ్యాణ్ లు కలిసి అనామిక, సామంత్ లకి గట్టి వార్నింగ్ ఇస్తారు. మరోవైపు కృష్ణమూర్తి ఇంటి ముందు మట్టి వేసుకుని విగ్రహాలు చేయడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడే కావ్య అక్కడికి వచ్చి.. నాన్నా వినాయక విగ్రహాల ఆర్డర్ వచ్చాయా.. నేను సాయం చేస్తానని సంబరంగా పక్కనే కూర్చుంటుంది. నీకెందుకమ్మా శ్రమ.. నేను చేయగలిగినవే ఆర్డర్ తీసుకున్నాను.. నువ్వు చేయొద్దులేమ్మా అని కృష్ణమూర్తి అంటాడు. నాన్నా నేను ఎంత స్థాయికి ఎదిగినా పునాదుల్ని మరిచిపోను.. నేను కూడా సాయం చేస్తాను నాన్నా అంటూ ప్రేమగా మట్టి పిసకడం స్టార్ట్ చేస్తుంది.

అప్పుడే కనకం కాఫీ పట్టుకుని వచ్చి.. కావ్యని అక్కడ చూసి కోప్పడుతుంది. అసలు కూతురు ఏ పరిస్థితుల్లో ఈ ఇంటికి వచ్చింది. దానితో ఈ పనులు ఏంటయ్యా? అని కనకం అంటుంది. నాన్న ఏమైనా నన్ను అత్తింటి నుంచి తీసుకొచ్చాడా.. నేను వచ్చాను.. నాన్నది తప్పేంటి.. నాన్నని ఎందుకు అంటున్నావ్ అని కావ్య అంటుంది. సరే మీతో నేను గెలవలేను కానీ.. ఒకసారి అల్లుడుగారి ఇంటికి వెళ్లొస్తాను.. ఆసుపత్రి నుంచి వచ్చి చాలా రోజులైంది. పలకరించడానికి వెళ్లకపోతే మనదే తప్పవుతుంది. మీరు ఎలాగో కదిలేలా లేరు. వచ్చేలా లేరు. నేనైనా వెళ్లొస్తాననేసి కనకం అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది.

మరోవైపు సామంత్ తో పాటు తన ఆఫీస్ కి వెళ్తుంది అనామిక. అక్కడ పని చేసే ఉద్యోగులు అది చూసి.. వాళ్లల్లో వాళ్లు తప్పుగా మాట్లాడుకుంటారు. అనామికను ఉద్దేశించి.. అక్కడ మొగుడ్ని రోడ్డు మీద పడేసింది.. ఇక్కడ మన బాబుని రోడ్డు మీద పడేయడానికి వచ్చిందని ఒక ఉద్యోగి అంటుంది. మన బాస్‌ని కూడా రోడ్డున పడేస్తుందా అని మరొకతను అనగా.. డబ్బుకోసం గడ్డి తినే బాస్‌కి ఇలాంటిదే కరెక్టు.. దొందూ దొందే అని ఆమె అంటుంది. ఇక సామంత్ క్యాబిన్ కు వెళ్ళిన అనామిక తన కుర్చీలో కూర్చుంటుంది. అనామికా.. నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా నమ్మలేకపోతున్నాను.. కాలేజ్‌లో ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నువ్వు ఓకే చేయలేదు కదా.. ఇప్పుడు నా క్యాబిన్‌లో చూస్తుంటే ఒక అద్భుతంలా ఉందని సామంత్ అంటాడు. మనిద్దరం కలిసి ఈ బిజినెస్ చూసుకుంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయొచ్చని అనామిక అంటుంది. ఎన్ని అద్భుతాలు చేసినా ఆ స్వరాజ్ గ్రూప్ నంబర్ 1‌ లో ఉంటుంది. ఈ కంపెనీ రెండో స్థానంలోనే ఉండిపోతుంది.. ఎందుకంటే ఆ సంస్థకు వందేళ్ల చరిత్ర ఉందని సామంత్ అంటాడు. ఇప్పుడు ఆ చరిత్రకు చెదలు పట్టింది. ఆ సంస్థకు డిజైన్స్ అందించే కావ్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆమె పుట్టింటి ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. అందుకే కచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టే ఉంటుంది. పైగా దుగ్గిరాల వారి ఫ్యామిలీకి వెళ్లకముందు మీడియేటర్ సందీప్ అనే వ్యక్తి కావ్య డిజైన్స్ అమ్మి పెట్టేవాడు. అతడ్ని మనం పట్టుకోవాలని సందీప్ ఫొటోని సామంత్‌కి చూపిస్తుంది అనామిక. వెంటనే బెల్ కొట్టి ఆ కంపెనీ మేనేజర్‌ని పిలిచి.. ఇతడి పేరు సందీప్.. ఇంతకు ముందు కావ్య డిజైన్స్‌ని ఇతడే అమ్మేవాడని మొత్తం ఆ మేనేజర్‌కి వివరంగా చెబుతుంది.

మనకు ఇంకో కంపెనీ ఉంది కదా.. ఈ మీడియేటర్‌ని ముందు పెట్టి.. మనం వెనుకే ఉండి.. అంతా నడిపిస్తాం.. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు.. కావ్య మనకు డిజైన్స్ ఇవ్వాలి. జాబులో జాయిన్ కావడానికి ఒప్పుకోవాలని అనామిక అంటుంది. అదంతా నేను చూసుకుంటాను మేడమ్ అనేసి ఆ మేనేజర్ వెళ్లిపోతాడు.

మరోవైపు నా డిజైన్స్ అమ్మి పెట్టండి. నాకు ఉద్యోగం చాలా అవసరమని కావ్య మాట్లాడుకుంది. అయితే సందీప్ ప్రస్తుతానికి.. సామంత్, అనామికల మనిషి కాదు. అయితే గతంలో మాదిరే ఇప్పుడు కూడా కళావతి డిజైన్స్ తీసుకుని కంపెనీలకు అమ్ముడానికి నా ప్రయత్నం నేను చేస్తానని మాటిచ్చాడు సందీప్. ఈ క్రమంలోనే కావ్య అవసరాన్ని అనుకూలంగా మార్చుకోవాలని అనామిక ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.