English | Telugu

దుబాయ్, సౌదీలో బ్రాంచెస్ పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు..ఆర్పీ అంత మొండోడు

కిర్రాక్ ఆర్పీ తన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని బ్రాంచెస్ పెట్టుకుని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కూకట్ పల్లిలో ‘నెల్లూరు పెద్దారెడ్డి’ చేపల పులుసు సక్సెస్ కావడంతో మణికొండలో సెకండ్ బ్రాంచ్ పెట్టాడు. దీని ఓపెనింగ్ కి ఎంతో మంది చిన్న, పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు.

ఇక ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కి మెగా బ్రదర్ నాగబాబు కూడా వచ్చి ఆర్పీ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు మాట్లాడారు. "ఆర్పీ చాలా మొండివాడు. ఆర్పీని గౌరవంగా మాట్లాడాలి అంటూ ఆర్పీ గారు అని సంబోధించి మరీ మాట్లాడారు. ఈ చేపల పులుసు కాన్సెప్ట్ ద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ రాలేదు..తనకు ఓపెనింగ్ సెంటిమెంట్ ఉందని చెప్పారు. అది సక్సెస్ కాకపొతే తనను తిట్టుకుంటాడు అని రాలేదని చెప్పారు. కామెడీతో పాటు ఫుడ్ బిజినెస్ లో మంచి పట్టు సాధించాడు. తలచుకుంటే ఏదైనా చేసేస్తాడు ఆ నమ్మకం ఉంది నాకు. దుబాయ్, సౌదీని కూడా ఆక్రమించేసి అక్కడ కూడా బ్రాంచెస్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎప్పుడో నాకు జబర్దస్త్ టైములోనే చెప్పాడు కానీ దాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటాడని నేను అనుకోలేదు. ఇదే విషయం మీద ఫోకస్ చేస్తే ఆర్పీ తొందరలోనే కోటీశ్వరుడు ఐపోతాడు" అంటూ తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మొత్తానికి జబర్ధస్త్ నుంచి బయటికి వచ్చేసిన ఆర్పీకి నాగబాబు మంచి సపోర్ట్ గా నిలిచి వెన్ను తట్టడం మంచి విషయం.

ఇక కిర్రాక్ ఆర్పీ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ లో తన పాత మిత్రులంతా కూడా కలిసి చేపల పులుసును టేస్ట్ మంచి మార్క్స్ ఇవ్వడంతో ఆర్పీ చేపల పులుసు ట్రెండింగ్ టాపిక్ లోకి వచ్చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.