English | Telugu

ఆటో రాంప్రసాద్ కి బ్రెయిన్ ట్యూమర్... క్లారిటీ!


జబర్దస్త్ లో ఫుల్ ఫేమస్ ఐన కమెడియన్స్ లో ఆటో రాంప్రసాద్ కూడా ఒకరు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ ఈ ముగ్గురు జోడి బుల్లితెర మీద సూపర్ హిట్ అయ్యింది. ఫ్రెండ్ షిప్ అంటే వీళ్లదే అన్నట్టుగా ఉంటుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. కిర్రాక్ ఆర్పీ రీసెంట్ గా ఓపెన్ చేసిన తన కర్రీ పాయింట్ సెకండ్ బ్రాంచ్ కి రాంప్రసాద్ వచ్చాడు. అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు. తనకు కోరమీను, రాగి సంకటి ఇస్తామని చెప్పాడు. అక్కడ ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.

"ఆర్పీకి జబర్దస్త్ లో కంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యాడు. టేస్ట్ చాలా బాగుంది..మా ఇంటికి కూడా చాలా దగ్గర.. టేస్ట్ బాగుంది కాబట్టే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. మా ఫ్రెండ్ కాబట్టి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ముందు మేము ఫ్రెండ్స్ తర్వాత మిగతా విషయాలు..సుధీర్ ఏదో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కి రాలేకపోయాడు. జబర్దస్త్ రీయూనియన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా..కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఇపోయారు. నాకు రైటర్ కావడం ఇష్టం. రీసెంట్ గా ఒక వెబ్ మూవీ చేసాను. నా హెల్త్ గురించి మీకు తెలియనిది ఏముంది..మీరే రాస్తారు కదా. థంబ్ నైల్ ఏదో పెడతారు.

ఆడియన్స్ లోపలి వెళ్లి చూస్తే అక్కడ అసలు కంటెంట్ ఏమీ ఉండదు. నేనేదో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే నాకేదో బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఏదేదో రాసేశారు..ఇంతకుమించి ఇంకేమీ రాయద్దు. అక్కడ ఏమీ లేదు." అని చెప్పాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.