English | Telugu
శోభా ముందే మాట్లాడుకొని అంతా ఫిక్స్ చేసుకొని వచ్చిందంట!
Updated : Nov 1, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ తో ఆకట్టుకుంటుంది. ఇక సోమవారం మొదలైన నామినేషన్ల ప్రక్రియ మంగళవారానికి చేరాయి. తొమ్మిదవ వారం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు.
అమర్ దీప్, అంబటి అర్జున్, టేస్టీ తేజ, యావర్, అశ్విని, శోభాశెట్టి, ప్రియాంక, భోలే షావలి ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. సోమవారం మొదలైన నామినేషన్.. పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, భోలే షావలి, టేస్టీ తేజల నామినేషన్ జరుగగా.. మంగళవారం మిగతా ఇంటి సభ్యుల నామినేషన్ ఆసక్తిగా సాగింది. మొదట శోభాశెట్టిని రతిక నామినేట్ చేసింది. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం నువ్వా నేన అన్నట్టు సాగుతూ పోయింది. వీళ్ళ మధ్యలోకి టేస్టీ తేజ వచ్చి.. నా గురించి మాట్లాడితే నేను మాట్లాడతానని అన్నాడు. దాంతో మధ్యలో దూరకని టేస్టీ తేజని రతిక అంది.
" హౌస్ లో నేను గ్రూప్ ఆడడానికే వచ్చాను. ముందే అంతా ఫిక్స్ చేసుకొని వచ్చాను. హౌస్ లో ఇలాగే ఆడతాను" అని శోభాశెట్టి అంది. ఏదైన మాట్లాడేటప్పుడు ముందు విను.. ఆ తర్వాత మాట్లాడు. నీకేమైన మెమోరి లాస్ ఉందా అని రతిక అనగా.. అవును నాకు మెమరీ లాస్ ఉంది. నేను ఇలాగే ఉంటానని శోభాశెట్టి అంది.
ఆ తర్వాత వచ్చిన యావర్.. అశ్వినిని అయిదు కారణాలు చెప్పి నామినేట్ చేశాడు. ఒక ఆడపిల్లని చేసి ఇంతాలా అంటావా అంటు అశ్విని బాధపడింది. అసలు నువ్వు నా నామినేషన్ థాట్ లో లేవు. ఇప్పటికి కన్ఫూజన్ లో ఉన్నానని యావర్ తో అశ్విని అంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు హీటెడ్ ఆర్గుమెంట్ సాగింది. ఇక అశ్విని తిరిగి యావర్ కి రివర్స్ నామినేషన్ చేసి.. నువ్వు నన్ను గెలికావ్. నేను నిన్ను గెలికాను. ఎస్ ఇట్ ఈజ్ రివేంజ్ నామినేషన్ అంటూ యావర్ ని నామినేట్ చేసింది అశ్విని.