English | Telugu

తన భార్య సీమంతాన్ని గ్రాంఢ్ గా చేసిన ముక్కు అవినాష్!


జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు‌. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.‌. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.

ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి.

ముక్కు అవినాష్ జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు. దాంతో అతనికి మరింత ఫ్యాన్ బేస్ పెరిగింది. దాంతో అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ముక్కు అవినాష్, అతని భార్య కలిసి 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అని చేసిన వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ఈ మధ్య అవినాష్ కొత్త కార్ కొన్న విషయం తెలిసిందే. అయితే అవినాష్ తండ్రి కాబోతున్న విషయాన్ని తన ఫ్యాన్స్ కి షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం 'ప్రెగ్నెన్సి టైమ్ లో ఎలాంటి ఫుడ్ తినాలి' అంటూ ఒక వ్లాగ్ ని తన ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా ' సీమంతం వేడుక షురూ' అంటూ మరొక వీడియోని తన ఛానెల్ లో అప్లోడ్ చేశాడు అవినాష్. తన భార్యకి సీమంతం చేస్తునట్లు చెప్తూ.. ఇంట్లో అందరితో కలిసి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు అవినాష్. నిజామాబాద్ నుండి బ్యూటిషియన్ వచ్చి తన భార్య అనూజకి మేకప్ వేసారని, తన మ్యారేజ్ కి తీసిన ఫోటోగ్రాఫర్స్ ని పిలిపించి ఫోటోగ్రఫీ చేపించాడు అవినాష్. ఇలా అన్నింటిని చాలా గ్రాండ్ గా చేసిన అవినాష్.. అందరికి థాంక్స్ చెప్పాడు. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.