English | Telugu

మెరీనా కామెంట్స్ ఆన్ హౌస్ మేట్స్!


బిగ్ బాస్ నుండి గత వారం బయటకొచ్చిన మెరీనా..హౌస్ మేట్స్ గురించి ప్రేక్షకులకు తన వర్షన్ వినిపించింది. తను బిగ్ బాస్ కి రావడం..ఇదే ఫస్ట్ టైం అంటూ అంచనాలకు మించి తను హౌస్ లో ఎలా ఉందో? తన తోటి హౌస్ మేట్స్ ఎలా ఉంటారో? ప్రేక్షకులతో సరదాగా పంచుకుంది.

"హౌస్ లోకి డిఫరెంట్ పర్సనాలిటీస్ వస్తారు..ఒక్కొక్కరిది డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. నేను హౌస్ మేట్స్ అందరితోనూ ఈక్వల్ గానే ఉన్నాను. టాప్ లో రోహిత్, రేవంత్ ఉంటారు. ఇక ఆదిరెడ్డి, ఇనయా టాప్ ఫైవ్ లో ఉండొచ్చు. కాగా శ్రీహాన్, శ్రీసత్య ఫేక్ గా ఉంటారు. శ్రీసత్య ప్రొవొక్ చేస్తుంది. ఆ తర్వాత మాట మార్చేస్తుంది" అంటూ మెరీనా చెప్పుకొచ్చింది. ఒక ఫ్యాన్ మాట్లాడుతూ "అయితే మీరు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు కదా? ఎక్కడ నెగెటివ్ అయ్యింది అని అనుకుంటున్నారు?" అని అడుగగా, "ఐ డోంట్ థింక్ సో..మీరే చెప్పాలి?" అని మెరీనా సమాధానమిచ్చింది.

ఆ తర్వాత ఒక ఫ్యాన్ "బెస్ట్ ఫుడ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ?" అని అడుగగా , "Kichidi" అని సమాధానమిచ్చింది మెరీనా. ఆ తర్వాత "రోహిత్ కి కాకుండా మీ సపోర్ట్ ఎవరికి అని ఒక ఫ్యాన్ అడుగగా, " నా సపోర్ట్ అందరికి " అని చెప్పింది. ఇలా మెరీనా ఒక్కో ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో మదర్ ఇండియాగా పిలుచుకునే మెరీనా.. బయటకు రావడం పట్ల ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.