English | Telugu

నామినేషన్స్ లో ఉన్నదెవరు? లేనిదెవరు?


బిగ్ బాస్ హౌస్ లో ప్రతీవారం జరిగే నామినేషన్ ప్రక్రియ కీలకమైంది. ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్నవారికి ఓట్లు వేసి, హౌస్ లో ఈ వారం ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు? అని ఓట్ల ద్వారా ప్రేక్షకులు నిర్ణయిస్తారు.

అయితే నామినేషన్స్ ని మొదట రోహిత్ మొదలుపెట్టాడు‌‌. కాగా సీక్రెట్ రూంలో నామినేషన్ ప్రక్రియ సీక్రెట్ గా సాగింది. రోహిత్ తన మొదటి నామినేషన్ గా శ్రీహాన్ ని చేయగా, తర్వాత ఫైమాని నామినేట్ చేసాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీసత్య మొదట రోహిత్ ని నామినేట్ చేయగా, సెకండ్ నామినేషన్ గా రాజ్ ని చేసింది. "రాజ్ మూడు వారాల నుండి సేవ్ అవుతు వస్తున్నాడు..అందుకే నామినేట్ చేస్తున్నాను" అని శ్రీసత్య అనగా, " శ్రీసత్య మీరు రాజ్ ని ఎందుకు నామినేట్ చేసారో వ్యాలిడ్ రీజన్ చెప్పండి? అని బిగ్ బాస్ అడుగగా, "రాజ్ గేమ్ లో ఎక్కువగా పాల్గొనలేదు..గేమ్ లో తన పర్ఫామెన్స్ లేదు బిగ్ బాస్" అని సమాధానమిచ్చింది.

ఆ తర్వాత సీక్రెట్ రూంకి వచ్చిన కీర్తిభట్ తన మొదటి నామినేషన్ గా శ్రీహాన్ ని, సెకండ్ నామినేషన్ గా శ్రీసత్య ని నామినేట్ చేసింది. కాగా ఫైమా మొదట రోహిత్ ని, సెకండ్ ఇనయాని నామినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీహాన్, రోహిత్ ని నామినేట్ చేసి, సెకండ్ నామినేషన్ గా ఆదిరెడ్డిని చేసాడు. ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరిని నామినేట్ చేసారు. అయితే ఈ నామినేషన్స్ లో మెజారిటీగా శ్రీహాన్ కి నాలుగు నామినేషన్స్ పడ్డాయి‌. ఆ తర్వాత ఫైమాకి మూడు, రోహిత్ కి మూడు నామినేషన్స్ పడ్డాయి. ఆ తర్వాత రాజ్, శ్రీసత్య, ఫైమా, ఇనయా, ఆదిరెడ్డికి రెండు చొప్పున నామినేషన్స్ పడ్డాయి. అయితే ఈ వారం నామినేషన్స్ లో లేనిది కీర్తి భట్, రేవంత్.. కాగా మిగిలిన కంటెస్టెంట్స్ అందరు కూడా నామినేషన్స్ లో ఉన్నారు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.