English | Telugu

టమాటో పచ్చడి చేసీ చేసీ నేను పచ్చడైపోయా!

'లేడీస్ అండ్ జెంటిల్‌మెన్' షో ఎవ్రీ వీక్ ఫుల్ టు ఫన్‌ని అందిస్తోంది. ఇక ప్రదీప్ హోస్టింగ్ కానీ అతను చేసే కామెడీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ షోకి యాంకర్ లాస్య, మంజునాథ్ ఎంట్రీ ఇచ్చారు."అసలు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? అలాగేభార్యలు ఇంట్లో ఉంటే వాళ్ళ సతాయింపు మాములుగా ఉండదు కదా మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది" అని మంజునాథ్‌ని అడిగాడు ప్రదీప్.

"మా ఇంట్లో మామూలు సతాయింపు ఉండదు. పీక్స్‌లో ఉంటుంది. ఆ సతాయింపుల్లో టాప్ పాయింట్స్ చెప్పాలంటే రీసెంట్‌గా కుకింగ్ విషయంలో నన్ను లాస్య తెగ సతాయిస్తూ ఉంది. ఒక్కసారి టమాటో పచ్చడి చేయమని అడిగింది. అది తిన్నాకఇక రోజూ అదే పచ్చడి చేయమని చంపేస్తోంది. ఇక అలా టమాటో పచ్చడి చేసీ చేసీ నేను పచ్చడైపోయాను" అన్నాడు.

అందుకు లాస్య, "అందుకే భర్తలు వంట నేర్చుకోకూడదు అనేది. అసలే నోటికి ఏం తిన్నా రుచించడం లేదు. మా అత్తగారు టమాటో పచ్చడి చేస్తున్నా నచ్చడం లేదు. మంజునాథ్ చేస్తేనే సూపర్‌గా ఉంటుంది. ఇక ఈయన నాతో ఆర్గ్యుమెంట్ చేసి గెలవలేక పచ్చడి చేస్తున్నారు" అని కామెడీగా అనేసరికి "అవును. నోటికి ఏదీ రుచించకపోతే రోజూ టమాటో చట్నీ తింటారా.. ఐనా మీ లేడీస్ తో వాదించి ఎవరు గెలుస్తారులే" అని కౌంటర్ సెటైర్ వేసాడు ప్రదీప్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.