English | Telugu

Krishna Mukunda Murari : అనుకున్నది సాధించినట్టున్నావ్.. నేను నీ కూతురిని నాన్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -432 లో.. అందరు భోజనం చేస్తుంటే.. మీరా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటుంది. ఏంటని ఇంట్లో వాళ్ళు అడుగగా.. ముకుంద ఫోటోని అక్కడ దండ వేసి ఉంచడం చూడలేకపోతున్న అని మీరా అంటుంది‌. నాక్కూడా ఇష్టం లేదని ఆదర్శ్ అంటాడు. అయితే తీసెయ్యండని భవాని చెప్పగా.. మీరా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరొకవైపు కృష్ణ బట్టలు సర్దుతు ఉంటుంది. మీ షర్ట్ కన్పించడం లేదని మురారితో కృష్ణ అంటుంది. రెండు రోజుల క్రితం ఆరేసావ్ గాలికి వెళ్లినట్టు ఉందని మురారి అంటాడు. అలా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మురారి షర్ట్ తన దగ్గర పెట్టుకొని మురారినే తన దగ్గర ఉన్నాడని మీరా అనుకొని ఫీల్ అవుతుంది. షర్ట్ ని చూస్తూ మాట్లాడుతుంది. షర్ట్ ని పిల్లో కింద దాచేసి బయటకు వెళ్తుంది. బయట మురారిని చూసి.. ఆలోచిస్తున్నాడని మీరా అనుకుంటుంది. ఇందాక నుండి వెతుకుతున్నారు.. ఏంటని మురారిని మీరా అడుగుతుంది. నా షర్ట్ కన్పించడని మురారి అనగానే.. నీ షర్ట్ నా దగ్గరే ఉంది అది ఎప్పటికి నీ దగ్గరకు రాదని మీరా అనుకుంటుంది. ఆ తర్వాత శ్రీనివాస్ దగ్గరికి మీరా వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావంటే.. నువ్వు చేరాల్సిన చోటుకి చేరవన్నమాట అని మీరాతో శ్రీనివాస్ అంటాడు.

ఆ తర్వాత మరి నీ కూతురు అంటే ఏమనుకున్నావ్.. ఇదిగో చూడు అంటు మధు తీసిన సెల్ఫీని చూపిస్తుంది. నాకు డబ్బులు కావాలని శ్రీనివాస్ తో ముకుంద చెప్తుంది. ఇంట్లో గోడకి ఫోటో పెట్టావ్ కదా అందరూ నమ్మలి కదా అని మీరా చెప్తుంది. ఇలాంటి సిచువేషన్ ఎవరికి రాకూడదు.. అసలు మురారి లేకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు కానీ కృష్ణకి ప్రాబ్లమ్ అని శ్రీనివాస్ అనుకుంటాడు. కాసేపటికి తర్వాత కృష్ణ, మురారిలు మాట్లాడుకుంటారు. మళ్లీ మురారి కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమోనని కృష్ణ భయపడుతుంది. మరొకవైపు ఆదర్శ్ మందు బాటిల్ తీసుకొని వెళ్తుంటే.. ఇంట్లో పెద్దమ్మ ఉంది, ఇలా చేస్తే బాధపడుతుందని ఆదర్శ్ తో మధు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.