English | Telugu
బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత షాకింగ్ కామెంట్స్!
Updated : Oct 14, 2024
బిగ్ బాస్ నుండి ఆరో వారం సీత ఎలిమినేషన్ అయి బయటకొచ్చేసింది. ఇక బయటకొచ్చే ముందు బిబి బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో యాంకర్ అంబటి అర్జున్ అడిగిన కొన్ని ప్రశ్నలకి షాకింగ్ సమాధానాలిచ్చింది సీత.
బిగ్‍బాస్ అనేది లైఫ్‍టైమ్ అవకాశం. దాన్ని సరిగా వాడుకున్నారా అని ప్రశ్నించగా.. ఎవరి ఆలోచన వారిదని, తను వంద శాతం ఇచ్చానని సీత చెప్పింది. టాస్కుల్లో తను కాకుండా ఇతరులను ముందుకు పంపడం తను డౌన్ అయ్యేందుకు కారణం అయి ఉండొచ్చని కిర్రాక్ సీత అంది. హౌస్‍లో మీ పతనం ఎప్పుడు మొదలైందో గమనించారా అని అడుగగా.. టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్లను పుష్ చేయడం వల్ల డౌన్ అయ్యానేమోనని నేను అనుకుంటున్నానని, తన నిర్ణయాల మీద ఎక్కువసార్లు కాన్ఫిడెంట్‍గా ఉంటానని సీత చెప్పింది. మనకు అనిపించింది మనం రైట్ అనుకుంటాం. కానీ అది బయటికి అలా కనిపించదని యాంకర్ అనగా.. అది లెక్కలు వేసుకొని గేమ్ ఆడినట్టు. అది రియల్ గేమ్ కాదని సీత అంది. ఏడ్వడం స్ట్రాంగ్‍గా అని యాంకర్ అడుగగా.. మరి అరవడం స్ట్రాంగా.. మీరు స్ట్రాంగ్ అని ఏమనుకుంటున్నారో.. అది తప్పని నాకు అనిపిస్తోందని సీత చెప్పింది. మంచితనమే కొంప ముంచిందని అనిపించిందా అని అడుగగా.. అలాగని నా క్యారెక్టర్ మార్చుకోలేనని సీత సమాధానమిచ్చింది.
సోనియాకు నిఖిల్ రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏడ్చారని అడుగగా.. గేమ్ చూసి నిఖిల్ ఇస్తాడనుకున్నానని, కానీ పర్సనల్ ఎమోషన్లతో ఇచ్చారని సీత అంది. నిఖిల్‍ను హస్బెంజ్ మెటీరియల్ అని సీత అనడంపై ప్రశ్నించగా.. నిఖిల్ ఒకడే ఒకరి వెంట పడ్డాడని సీత అంది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన టేస్టీ తేజ తనకు చిరాకుగా అనిపించారని సీత చెప్పింది. టేస్టీ తేజ చిరాకు అనే అనిపించాడు. ఎందుకంటే వారంలో ఆమె పర్ఫార్మ్ చేసినట్టు, కాన్ఫిడెన్స్ కనిపించలేదని సీత అంది. గేమ్‍పరంగా నిఖిల్.. పారదర్శకంగా ఉండడని చెప్పారు. హజ్బెండ్ మెటీరియల్.. వేస్ట్ మెటీరియల్‍లోకి పంపండి అంటు జోక్ చేశాడు యాంకర్. హౌస్‍లో ఉన్నప్పుడు తన తల్లి పంపిన లెటర్ గురించి అడగగా.. సీత ఎమోషనల్ అయ్యింది.. హౌస్‍లో తనను ఆమె చూడాలనుకున్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సీత హౌస్ లో జరిగిన కొన్నింటిని షేర్ చేసినట్టు తెలుస్తుంది.