English | Telugu

శ్రీహాన్ కి ఓపెన్ కౌంటర్ ఇచ్చిన కీర్తి భట్!

రోజుకో ట్విస్ట్ తో బిగ్ బాస్ మలుపులు తిరుగుతుంది. గత సోమవారం నామినేషన్స్ లో మొదలైన గొడవలు మరింతగా పెరిగాయి. కారణం ఏంటంటే కంటెస్టెంట్స్ ఈ గొడవలను ఇంకా పెంచుకుంటూ రావడమే. అయితే సోమవారం జరిగిన నామినేషన్స్ లో కీర్తిభట్ తనకి శ్రీహాన్ కెప్టెన్సీ నచ్చలేదు అని చెప్పడం..శ్రీసత్య ఆటిట్యూడ్ బాగోలేదని చెప్పి నామినేట్ చేయడం. అంతా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. కొత్తగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అదే 'BB Transport Task'.

కాగా మొదట బజర్ రాగానే అందరు పాల్లొనగా అందులో ఆదిరెడ్డి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ కి అర్హత సాధించాడు. అయితే శ్రీహాన్, శ్రీసత్యని ఎన్నుకుంది కీర్తి భట్. తను అలా ఎన్నుకున్నాక కారణం చెబుతూ " శ్రీసత్య అల్రెడీ కెప్టెన్ గా చేసింది. ఇంకా శ్రీహాన్ కెప్టెన్సీ బాగోలేదు..ముందు ఉన్నట్టుగా లేడు" అని అంది. దానికి రిప్లైగా శ్రీహాన్ మాట్లాడుతూ "అర్థం అయ్యింది..టార్గెట్ చేసావ్" అని అన్నాడు. అలా అనేసరికి విసిగిపోయిన కీర్తి భట్ "అవును..నువ్వే నా టార్గెట్" అని ఓపెన్ కౌంటర్ ఇచ్చింది. "ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు తీసుకోవాలి.. అలా తీసుకోకపోతే మనమేం చెయ్యలేం" అని కీర్తి భట్ అంది. అలా అనడంతో శ్రీహాన్ "ఆ మాట నువ్వు మాట్లాడుతున్నావా?" అంటూ సెటైర్ వేసాడు. దీనికి కీర్తి భట్ కూడా గట్టిగా సమాధానమిచ్చింది. "నువ్వు మాట్లాడుతున్నావ్ గా..నేను మాట్లాడుతాను" అని అలాగే సెటైర్ వేసింది. దీంతో శ్రీహాన్ సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ గేమ్ మొదలైంది.

గేమ్ లో ఒక్కొక్కరుగా కెప్టెన్సీ పోటీకి అర్హతను సాధించారు. అలా అందరూ అయిపోగా, ఇనయా, కీర్తి భట్, మెరీనా ముగ్గురు మిగిలారు. వీరు ముగ్గురు డిసైడ్ చేసుకొని వారి ఏకాభిప్రాయం చెప్పాలి. కానీ మొదట ఇనయా డ్రాప్ అవుతా అంది. ఆ తర్వాత కీర్తిభట్ డ్రాప్ అవుతా అంది. అయితే శ్రీహాన్, రేవంత్, రోహిత్, ఆదిరెడ్డి నలుగురు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే కీర్తి భట్ ని గేమ్ నుండి తప్పించి..ఇనయా, మెరీనాని కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో కీర్తి భట్ బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.