English | Telugu
ఏమిటి మంచం అడిగావంట..హీరోయిన్ ముందు సుధీర్ పరువు పాయే!
Updated : Nov 18, 2022
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వల్ల స్టార్ యాంకర్ హోదా సంపాదించుకున్నాడు. ఒక వైపు టీవీ షోస్, మరో వైపు మూవీస్, ఈవెంట్స్ వంటి వాటితో ఫుల్ బిజీగా ఉన్నాడు. "సాఫ్ట్ వేర్ సుధీర్" మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ రీసెంట్ గా "గాలోడు" మూవీలో నటించాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు ఈ టీమ్.
ఇక ఇప్పుడు ఈ మూవీ హీరో హీరోయిన్స్ సుధీర్, గెహ్నాసిప్పి బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి, సుధీర్‌పై పంచుల వర్షం కురిపించాడు. వీళ్ళ మధ్య జరిగిన ఒక ఇంటరాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఇంటర్వ్యూ ప్లేస్ లో వీళ్ళ ముగ్గురు నిలబడి ఉన్నారు. ఇంతలో సత్తి పోస్టర్ చూసి దుమ్ము లేపుతున్నావుగా అని సుధీర్ ని అనేసరికి "ఏదో యాక్షన్ సీన్ అన్నా...మనం కూర్చుని మాట్లాడుకుందాం’’ అని అన్నాడు. అందుకు సత్తి ‘‘కుర్చీల్లేవు ..ఏం లేవు..ఆ టెంటు వాడికి చెప్పాను..ఛ..కుర్చీలు నేనే తెచ్చుకోవాలి..మైకులు కూడా నేనే తెచ్చుకోవాలి’’ అని అసహనంతో ఫోన్ చేసి ‘‘ అరే రాజు ! ఓ మూడు కుర్చీలు తీసుకురా.. చెక్కవి. మా దోస్తురా.. సినిమా చేస్తున్నాడు. ఓ మెట్లు ఎక్కుతున్నావా’’ సరే రా " నువ్వు మంచాలు తెమ్మని చెప్పినావా" అని సుధీర్ వైపు చూసి అడిగేసరికి. అయ్యో "నేనెందుకు మంచాలు తెమ్మని చెప్తాను...ఇంటర్వ్యూ కదా కుర్చీలు తెమ్మని చెప్పు అన్నా’’ అన్నాడు.
ఇక సత్తి ‘‘నీ ప్రోగ్రాం అంటే మంచాలు అంటున్నారు వాళ్ళు మరి’’ అనేసరికి సుధీర్ నవ్వుతూ ‘‘కాదన్నా’’ అని సమాధానం ఇచ్చాడు. చివరికి కుర్చీలు తెప్పించాడు సత్తి.