English | Telugu

'నీకు అవసరం లేకపోతే వెళ్లి రామాయణం చదువుకో'

స్టార్ మా రాత్రి 8 ఐతే చాలు "ఇంటింటి గృహలక్ష్మి" అంటూ కస్తూరి వచ్చేస్తుంది. సీరియల్ లో ఎంతో పద్దతిగా, హుందాగా, గౌరవప్రదమైన పాత్రలో కనిపిస్తూ ఉంటుంది. ఐతే బయట కస్తూరి వేసే డ్రెస్సులు, చేసే అల్లరి, హడావిడి చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఎవ్వరికైనా సరే చెంప మీద కొట్టినట్టుగా సమాధానం ఇచ్చేస్తుంది. కస్తూరిని దరింగ్ వుమన్ గా చెప్పుకోవచ్చు. మోడరన్ డ్రెస్సులంటే కస్తూరి బాగా ఇష్టపడుతుంది. కస్తూరి అలాంటి డ్రెస్సులు వేసుకుంది అంటే చాలు నెటిజన్స్ కామెంట్స్ మాములుగా ఉండవు. అలాంటి ఒక ఘటన రీసెంట్ గా జరిగింది.

ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చి పడేసింది. స్విమ్‌సూట్‌ వేసుకుని స్విమ్ చేస్తున్నట్టుగా ఉన్న ఒక స్లో మోషన్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కస్తూరి..‘‘ఈ నీళ్లు రమ్మంటూ స్వాగతిస్తుంటే నన్ను నేనే మైమరిచిపోతున్నా" అని ఒక కాప్షన్ పెట్టుకుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు ఒక నెటిజన్.. ‘‘ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా?’’అని తమిళ్ లో కామెంట్ చేశాడు. ‘‘అవసరమే. ఈ వయసులో నీకు అవసరం లేదు. పో.. వెళ్లి రామాయణం చదువుకో’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. ఆ సమాధానానికి ఆమె ఫాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఏం చెప్పారంటూ పొగిడేశారు. తన ఫొటోలపై, తన వస్త్రధారణపై నెగటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళను ఆమె అస్సలు వదిలిపెట్టదు. కస్తూరి ప్రస్తుతం ‘ఇంటింటి గృహలక్ష్మి’ డైలీ సీరియల్‌లో తులసి పాత్రలో తెలుగు ఆడియన్స్ ని అలరిస్తోంది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.