English | Telugu
జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఇంట్లో విషాదం!
Updated : Jan 23, 2023
జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి అందరికీ తెలుసు..టిక్ టాక్ స్టార్ గా అందరికీ పరిచయమే. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఇంట్లో విషాదం నెలకొంది.
గుండెపోటుతో ఆమె తండ్రి తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ఆడియన్స్, జబర్దస్త్ కమెడియన్స్ అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మృతిపై రీతూ చౌదరి భావోద్వేగానికి గురయ్యింది. తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తండ్రితో కలిసున్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో ఇదే నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్ళిపోయావు నాన్నా? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి” అంటూ రీతూ చౌదరీ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీతూ చౌదరికి తన నాన్న అంటే చాలా ఇష్టం అని తమ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. ఇంట్లో అందరి కంటే నాన్న అంటేనే చాలా ఇష్టం. ఏ విషయమైనా సరే ఆయనతోనే పంచుకుంటుంది. అలాంటిది రీతూ ఇప్పుడు తన తండ్రి లేరనే విషయాన్ని తట్టుకోలేకపోతోంది. జబర్దస్త్ కమెడియన్స్, రీతూ ఫాన్స్ , నెటిజన్స్ అంతా కూడా ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.